ఆ విషయంలో చైనాకు షాక్‌ ఇచ్చిన ఇటలీ?

Chakravarthi Kalyan
ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు మారినప్పుడు విదేశాంగ విధానాలు సాధారణంగా మార్పులు వస్తుంటాయి. కానీ నియంత దేశాల్లో మాత్రం విదేశాంగ విధానంలో మార్పులు ఉండవు. నియంత దేశాల్లో ప్రస్తుతం చైనా లాంటి పెద్ద దేశం ఉందని చెప్పుకోవచ్చు.
అయితే నియంతలు మారినప్పుడు అక్కడి విదేశాంగ విధానాలు మారిన మారొచ్చు.


ఇటలీ లో ప్రధానమంత్రి ప్రస్తుతం మారారు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చైనాకు అనుకూలంగా ప్రవర్తించేవారు. ఇటలీ చైనా సంబంధాలు చాలా మెరుగ్గా ఉండేవి. ప్రస్తుతం ఇటలీ ప్రధానమంత్రిగా మరో వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడంతో చైనాతో ఉన్న సంబంధాలను ఆయన కొనసాగించాలనుకోవడం లేదు. ముఖ్యమైన వన్ రోడ్డు వన్ బెల్ట్ చైనా కలల ప్రాజెక్టు కు ఇటలీ మాజీ ప్రధాని అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రధాని వన్ రోడ్ వన్ బెల్టుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.


ఈ నినాదంతో ప్రపంచ దేశాలను ఒక కుగ్రామంగా మార్చి తన వ్యాపార వాణిజ్య విస్తరణను మూలమూలకు విస్తరింప చేయడం దాని ఉద్దేశం. కానీ అమెరికా కంటే గొప్పగా ప్రపంచాన్ని ఏలాలని చైనా భావిస్తున్న విషయం ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు పసిగడుతున్నాయి. చాలా ఆఫ్రికా దేశాలకు ఇప్పటికే చైనా విపరీతమైన అప్పులు ఇచ్చి ఆ దేశాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అదే విధమైన ధోరణితో యూరప్ దేశాలతో కూడా వ్యవహరించాలని చూసింది. అందులో ఇటలీ మాజీ ప్రధాని చైనాకు అనుకూలంగా ఉండడం వారికి కలిసి వచ్చింది.


కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని దానికి వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఇప్పుడు చైనా పరిస్థితి ఏం చేయాలో తోచని విధంగా మారింది. వన్ రోడ్ వన్ బెల్టుకు ఇండియా కూడా వ్యతిరేకంగానే ఉంది. ఎందుకంటే చైనా సామ్రాజ్యవాదం,విస్తరణ కాంక్ష వన్ రోడ్డు వన్ బెల్టుతో నెరవేరే అవకాశం ఉంటుంది. అది అలా కాకుండా చూడాలంటే చైనాను కచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని భారత్ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: