సీఎం సీటుపై ఆశలు వదిలేసుకున్న పవన్‌?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన క్యాడర్ కు ఒక స్పష్టతనిచ్చారు. ఇకపైన తన నివాసం మంగళగిరి అని చెప్పారు. మనకు ముఖ్యమంత్రి పదవి రావాలంటే మనం ఎదగాలని అన్నారు. పార్టీలోకి రావాలని అనుకుంటున్న వారిని ఆహ్వానించాలని, తటస్థులను చేర్చుకోవడానికి మనం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవ్వరి దగ్గర టికెట్లకు డబ్బులు తీసుకోమని, ఎవరైనా టికెట్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మీరు డబ్బులు ఇస్తే అది మీ తప్పవుతుందని అన్నారు.


జనసేన పార్టీ మాత్రం ఎవరిని టికెట్ల కోసం డబ్బులు ఇవ్వమని అడగదని అన్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీకి వైజాగ్ లో ఒక్క సీటు రాదని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో జనసేన ఉంటుంది అని అన్నారు. అంటే దీనర్థం టీడీపీ అధికారంలోకి వస్తుందని అందులో తాము భాగస్వాములుగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో జనసేన స్వయంగా అధికారంలోకి రాదని తేలిపోయింది.


ముఖ్యమంత్రి పదవి అంటే అవకాశం వచ్చినపుడు అందుకుందాం.. ఇప్పటికైతే పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని అన్నారు. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించకుండా కేవలం పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి. పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తుందనేది క్లారిటీతో ఉండాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో జనసేన తుడిచి పెట్టుకుపోయింది.


ఈసారి ఆ రెండు జిల్లాల్లో పార్టీని ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. మరి టీడీపీ, జనసేన పొత్తు కలిస్తే జనసేనకు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇస్తారు.. ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తారు.. పోనీ విడివిడిగా ఎన్నికలకు వెళ్లినా ఏ ప్రాంతంలో జనసేన టీడీపీకి మద్దతిచ్చే అవకాశం ఉంది.. ఇలాంటి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. వీటిన్నింటికి రాబోయే ఎన్నికలే సమాధానం చెబుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: