ఆ కోర్టులో జగన్‌కు అన్యాయం జరిగిందా?

Chakravarthi Kalyan
జగన్ అక్రమాస్తుల కేసులో శంకర్ రావు అనే  కాంగ్రెస్ మాజీ  ఎమ్మెల్యే హై కోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశంలో జగన్ పెట్టిన సంస్థల్లో అనేక మంది పెట్టుబడులు పెట్టారు. ఈయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రయోజనాలు కూడా పొందారు. దీనికి అప్పటి ప్రభుత్వం సహకరించిందని చెప్పారు. అయితే సుప్రీం కోర్టు సీబీఐని ప్రాథమిక దర్యాప్తు చేయాలని ఆదేశించడం అందులో లక్ష కోట్లు అవినీతి జరిగిందని ప్రాథమికంగా తేల్చడంతో సంచలనం కలిగింది.


అయితే 2009 నుంచి 2014 వరకు ఇది జరిగింది. కానీ ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోవడం జగన్ జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇలాంటి ఒక పరిణామం తమిళనాడు లో చోటు చేసుకుంది. స్టాలిన్ మంత్రివర్గంలోని త్యాగరాాజన్ అనే మంత్రి ఫోన్ లీక్ అయింది. అందులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు.


ఎందుకు పెడుతున్నారు. ఎవరికీ లాభం చేకూరుతుంది. ఎక్కడ అవినీతి జరుగుతుందనే విషయాలు ఆయన ఫోన్ లో మాట్లాడారు. దీనికి ఆయనకు సంబంధించి మంత్రి పదవిని మాత్రమే చేంజ్ చేశారు. కానీ పూర్తిగా తొలగించలేదు. అయితే దీనిపై ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో కేసు వేశారు. స్వయంగా రాష్ట్ర మంత్రి వర్గంలోనే ఒక మంత్రి అవినీతి జరుగుతుందని మాట్లాడారు. ఎక్కడెక్కడ జరుగుతుందని చర్చించారు. దీనిపై కేసును స్వీకరించాలని కోరారు.


దీనికి సుప్రీం కోర్టు స్పందిస్తూ కేసు విచారణ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. మొత్తం ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా కేసులను ఎలా స్వీకరిస్తామని అంది. గతంలో జగన్ విషయంలో ఇదే సుప్రీం కోర్టు లో ఎమ్మెల్యే ఆశ్రయించినపుడు ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇప్పుడేమో కుదరదని కోర్టు చెబుతోంది. ఇలా రెండు దోరణుల వల్ల ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: