రష్యా అండతో నైగర్ యుద్ధానికి దిగుతుందా?
తిండి, నీరు, బట్టలు కూడా నైగర్ పాలకులకు ఆపేశారని తెలిసింది. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు నైగర్ లో తిరుగుబాటు దారులను ప్రభుత్వం నుంచి దిగిపోవాలని హెచ్చరించాయి. వెస్ట్రర్న్ ఆఫ్రికా దేశాలను ఏకోవాస్ అంటారు. ఆరు ఆఫ్రికా దేశాల ఆర్మీని కలిపి ఏకో వాస్ అని పిలుస్తారు. అయితే ఈ ఏకోవాస్ ప్రస్తుతం నైగర్ లోని తిరుగుబాటు సైన్యంపై యుద్దం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే దీనిపై రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రష్యా ఏకోవాస్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
నైగర్ లోని తిరుగుబాటు సైన్యానికి అండగా నిలబడతామని చెప్పింది. రష్యా ఫారన్ మినిస్టర్ మాట్లాడుతూ.. ఏకోవాస్ లు గనక నైగర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారం చేబట్టిన తిరుగుబాటు సైన్యం పై ఏ మాత్రం దాడి చేసినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. పరిస్థితులు చూస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా తయారయ్యాయి.
అమెరికా, ఫ్రాన్స్ లు ఒక వైపు జోక్యం చేసుకుంటుంటే.. రష్యా మరో వైపు హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. అమెరికా, రష్యాకు ఉక్రెయిన్ విషయంలోనే అస్సలు పడటం లేదు. ఇఫ్పుడు నైగర్ విషయంలో కూడా రెండు తమదే పై చేయి కావాలని కోరుకుంటున్నాయి.