రష్యాలో కలకలం రేపిన అమెరికా గూఢచారి?

Chakravarthi Kalyan
రష్యా లో ఇటీవల అమెరికాకు చెందిన గూడచారి దొరికిపోయాడు. యుద్దం ప్రారంభమైన తర్వాత రష్యా ఏం చేస్తుంది. ఎలాంటి ఫ్లాన్ లు చేస్తుంది. రష్యాను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రతి వివరాలను తెలిపే అమెరికాకు చెందిన గూడచారి దొరికిపోయారు. 2021 సంవత్సరంలో కూడా అమెరికా సైన్యంలో పని చేసిన గూడచారి రష్యా ఇంటిలిజెన్స్ వర్గాలకు మాస్కోలో దొరికిపోయారు.


అయితే గూడచార్యం చేస్తున్నారనే నెపంతో అమెరికా గూడచారిపై రష్యా ఉరిశిక్ష విధించింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఉరిశిక్షను రద్దు చేయాలని రష్యాను కోరింది. అయితే అమెరికాకు రష్యా మరో షాక్ ఇచ్చింది. తాజాగా రష్యా లో అమెరికాకు చెందిన మరో గూడచారిని అరెస్టు చేశామని చెప్పింది. అయితే ఎందుకు అరెస్టు చేశారు. ఏ కారణం చేత అరెస్టు చేశారనే వివరాలు తెలపలేదు.


ప్రతి  దేశం మరో దేశంలో ఇలా ఆయా దేశాల అంతర్గత వ్యవహారాలు తెలుసుకునేందుకు గూడచార వ్యవస్థను వాడుతుంటుంది. ఇంగ్లీష్ లో స్పై అంటారు. అంటే ఒక దేశ రహస్యాలు, సైనిక, ఆర్థిక, రాజకీయ విషయాలను తెలుసుకుని తమ దేశానికి తెలియజేస్తుంటాయి. ఇలా ప్రతి దేశానికి అంతర్గత రహస్యాలు ఉంటాయి. కానీ ఇలా రహస్యాలను కనుగొని దేశ భద్రతకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలో గూడచారులను అరెస్టు చేస్తుంటారు.


గూడచార వ్యవస్థలో చాలా మంది గూడచారులు అని గుర్తు పట్టడం కష్టం. వారు సామాన్య ప్రజల్లో కలిసిపోయి ఉంటారు.  లేదా సమాజంలో కలిసిపోయి ఎవరూ గుర్తుపట్టని విధంగా మారి ప్రభుత్వ సమాచారాలను తస్కరిస్తారు. లేదా అక్కడి సమాజంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి. ఏం చేయబోతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుని శత్రు దేశంపై దాడి చేయనున్నారనే ముందస్తు సమాచారాన్ని రాబడతారు. తద్వారా తమ దేశానికి సంబంధించిన భద్రత విషయంలో ఎంతో రిస్క్ తో కూడిన గూడచార ఉద్యోగాన్ని చేస్తూ ప్రాణాలు ఫణంగా పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: