అమెరికా, రష్యా.. మధ్యలో నలిగిపోతున్న నైగర్‌?

Chakravarthi Kalyan
ఇప్పుడు అమెరికా నైగర్ దేశంలో తన సైన్యాన్ని మోహరించిందని తెలుస్తుంది. అంతే కాకుండా అక్కడ ఫ్రాన్స్ సైన్యం కూడా అమెరికా సైన్యంతో  ఆ ప్రాంతంలో ఉందని తెలుస్తుంది. నైగర్ అంటే అది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. అయితే మరి అమెరికా ఇంకా ఫ్రాన్స్ అక్కడ తమ సైన్యాన్ని ఎందుకు మోహరించాయి అంటే దానికి ఒక కథ ఉంది. ‌ నైగర్  దేశంలో ప్రభుత్వం పైన అక్కడ ఉన్న ఉగ్రవాదులు తిరుగుబాటు చేస్తున్నారట.


అందుకోసం అమెరికా తన సైన్యాన్ని అక్కడ ఉన్న ప్రభుత్వానికి తోడుగా పంపించిందని తెలుస్తుంది. అయితే ఇలా ప్రభుత్వం పైన ఉగ్రవాద దాడులు జరిగే ప్రదేశాలు, జరుగుతున్న ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. భారత దేశంలోనూ ఇదే విధంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. అలాగే పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లోను  కూడా ఇదే విధంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి.


 మరి పక్క దేశాలపై అమెరికాకు అంత సడన్ గా ఎందుకంత ప్రేమ వచ్చింది?  మరి భారత దేశంలోకి అమెరికా ఎందుకు తన సైన్యాన్ని పంపించలేదు అంటే దానికి మరో లెక్క ఉంది. అమెరికా  చేసే సహాయం వెనకాల కూడా ఒక కుట్ర ఉందని అంటున్నారు. అమెరికా అక్కడ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నట్టు చేస్తూ నైగర్ దేశాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఇదంతా అని అంటున్నారు.


దాంతో ఇక  చేసేదేమీ లేక నైగర్ అధ్యక్షుడు కూడా అమెరికా చెప్పు చేతల్లోకి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. దాంతో అక్కడ సైన్యం కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని మిగిలిన దేశాలతో వీళ్ళపై యుద్ధం చేయించాలి. రష్యా అధ్యక్షుడికి అనుకూలమైన వ్యాగనార్ గ్రూపు సైన్యం ఇప్పుడు నైగర్ దేశం తరఫున పని చేస్తుంది. అంటే రష్యా సైన్యాన్ని అడ్డుపెట్టుకుని నైగర్ దేశం తాము అమెరికా చెప్పు చేతల్లో ఉండడం ఇష్టం లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: