వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమా?

Chakravarthi Kalyan
వైసీపీ మొన్నటి వరకు 175 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే టైమ్స్ నౌ సర్వే ప్రకారం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ దాదాపు 165 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని, 24 ఎంపీ స్థానాలు వైసీపీవేనని తేల్చింది.  తెలుగు దేశం పార్టీకి సంబంధించి ఓల్డ్ టీం, మేధావుల వర్గం ఏపీలోని నాలుగు ప్రాంతాల్లో జరిపిన విస్తత సర్వేలో రాయలసీమలో వైసీపీ పార్టీ మెజార్టీలో ఉంటుందని, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో స్వల్ప ఆధిక్యతతో టీడీపీ ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లో హోరాహోరీగా ఉందని పేర్కొంది.

అయితే ఇంత హోరాహోరీ మధ్యన ప్రస్తుత లెక్కల ప్రకారం.. 90 నుంచి 95 స్థానాలు గెలుచుకుని వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో 90 నుంచి 95 అంటే వచ్చే రోజుల్లో 60 నుంచి 65 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోతారని టీడీపీ అంచనా వేసుకుంటుంది. దీనికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఓట్లు చీలకుండా చేసుకుంటే ఇది సాధ్యమనే భావన తెలుగు దేశం పార్టీ ఉన్నట్లు సమాచారం. అంటే 2014 లో అధికారం చేపట్టినట్లు వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమనే భావన సైకిల్ శ్రేణుల్లో కనిపిస్తోంది. దీనికి సరైన గ్రౌండ్ వర్క్ చేసి ఉభయ గోదావరి జిల్లాలో ఓట్లు చీలకుండా టీడీపీ గనక ప్లాన్ వేస్తే అధికారం తమదేనని భావిస్తున్నారు. అదే సమయంలో ఇండియా టుడే చేసిన సర్వే కూడా టీడీపీకి అనుకూలంగా రావడం కలిసొచ్చేదిగా భావిస్తున్నారు.

ఇంత కంటే మంచి అవకాశం ఉండదని రాబోయే రోజుల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే టీడీపీ మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాల్సిందేనని భావిస్తుంది. మరి బీజేపీ ఏం చేస్తుంది. జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లను అడుగుతుంది. ఇవన్నీ తేలితేనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాట పట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: