దిల్లీ లిక్కర్ కేసులో సంచలనం?
లిక్కర్ కేసులో ముందు దూకుడుగా వెళ్లిన ఈడీ ఆ తర్వాత దాని విచారణ మందగించింది. అసలు కారణం ఏమిటంటే ఈడీకి సంబంధించిన పవన్ కార్తికేయ అనే అసిస్టెంట్ డైరెక్టర్ రూ. 5 కోట్లు లంచం తీసుకుని కేసును నీరు గార్చరనే ఆరోపణలతో పవన్ తో పాటు అతని సిబ్బంది మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఈయన లంచం తీసుకుని అరెస్టు చేయలేదని ఏకంగా ఈడీనే ఆయనపై సీబీఐకి కంప్లైంట్ ఇచ్చింది.
అసలు ఈడీ కేసు నుంచి తప్పించుకోవడానికి మనీష్ సిసోడియా లాంటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రికే కాలేదు. అలాంటిది వీరు కవితను ఎందుకు అరెస్టు చేయలేదో ఇన్ని రోజులు అంతుచిక్కని ప్రశ్నలా తయారైంది. అయితే దీనికి సమాధానం సీబీఐకి దొరికినట్లైంది. కవిత వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈడీలో ఉన్న ఉన్నతాధికారులు లంచంకు అమ్ముడైపోయారు. దీనిపై ఇప్పుడు సీబీఐ విచారణ జరుపుతోంది.
ఇంత పెద్ద వార్త తెలిసినా కూడా ఎక్కడా కూడా దీని గురించి తెలుగు మీడియాలో ప్రధాన పత్రికల్లో ఎక్కడా రాయలేదు. కారణం సీఎం కేసీఆర్ ను చూస్తేనే తెలంగాణలో మీడియా వణికిపోతుంది. ఇష్టమొచ్చిన వార్తలు రాసే వారు.. ఈ విషయం వెలుగులోకి వచ్చి మూడు రోజులవుతున్నా ఒక్క ప్రధాన పత్రిక ఈ విషయాన్ని ప్రచురించకపోవడం అనేది దారుణమైన అంశం. నిజాలు దాచిపెట్టడానికి ఉన్నది కావు పత్రికలు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టినపుడే సమాజానికి జర్నలిజం విలువలు తెలుస్తాయి. ప్రజలకు నమ్మకం కలుగుతుంది.