ఏపీలో సంక్షేమం ఫుల్.. మరి కరంట్?
జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ముతో ఇప్పుడు చాలామంది టీవీలు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ లు ఇలా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా కొంటున్నారని తెలుస్తుంది. దాంతో కరెంటు బిల్లు 300 యూనిట్లు కన్నా ఎక్కువే వినియోగం అవుతుంది. గతంలో 300యూనిట్లు కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వస్తే కొన్ని పథకాలను తీసివేసేది జగన్ ప్రభుత్వం.
మొన్నా మధ్య ఈ రకంగానే కొన్ని తీసివేయడం జరిగిన సందర్భంలో దానిపై రచ్చ కూడా జరిగింది. కానీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇది కరెక్ట్ కాదని అనుకున్న ప్రభుత్వం 300 యూనిట్ల లెక్కను పక్కన పెట్టింది. కానీ ఆంధ్రాలో ఇప్పుడు కావలసిన విద్యుత్ లెక్క 72,302 మిలియన్ యూనిట్లు. కానీ సప్లై అవుతున్నది 71,893 యూనిట్లు మాత్రమే. 409 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత కనిపిస్తుంది.
తమిళనాడులో 1,14798 మిలియన్ యూనిట్లకు 1,14,722 మిలియన్ యూనిట్ల సరఫరాతో 76 మిలియన్ యూనిట్ల కొరత ఉంది. తెలంగాణకు 33 మిలియన్ యూనిట్ల కొరత, కర్ణాటకకు 25 మిలియన్లు, కేరళకు 21 మిలియన్ యూనిట్ల కొరత ఉంది. కానీ తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ 100% విద్యుత్ సరఫరా చేస్తున్నాయట. అయితే గతంలో తెలంగాణలో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని వ్రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు 100% అంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో 99% సరఫరా అవుతుంటే ఒక్క శాతం మాత్రం విద్యుత్ కొరత ఉందని తెలుస్తుంది.