జీ20 మీటింగ్స్.. ఛాలెంజింగ్‌గా మోదీ?
ప్రస్తుతం భారత దేశ రాజధానిలో జి 20 సదస్సు జరగనుంది. దీనికి 20 దేశాలు కాకుండా మొత్తం 45 దేశాలు ఈ సమావేశాలకు హాజరుకానున్నాయి. ఆ దేశాలకు చెందినటువంటి అధ్యక్షులు ప్రధానులు, ముఖ్య ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, తదితర కీలకమైనటువంటి వ్యక్తులు ఢిల్లీకి రానున్నారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లోని చైనా పాక్ సరిహద్దుల వద్ద భారత్ త్రిశూల్ పేరుతో సైనిక విన్యాసాలను చేపట్టాలని భావిస్తోంది. ఆల్రెడీ త్రిశూల్ విన్యాసాలు భారత్ చేస్తుంది. లడక్ ప్రాంతంలో కూడా ఎయిర్ ఫోర్స్ తదితర ముఖ్యమైన యుద్ధ విమానాలతో తమ సైనిక విన్యాసాలను భారత్ చేస్తూనే ఉంది.
దీని వెనక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. జి 20 సమావేశాలను ఎలాగైనా రద్దు కావాలని స్వదేశంలో చాలా మంది భావిస్తున్నట్టు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ చాలెంజింగ్ గా తీసుకున్నారు. కట్టు దిట్టమైనటువంటి భద్రత మధ్య ఈ జి 20 సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు జరిగే ప్రాంతంలో నోఫ్లై జోనుగా కూడా ప్రకటించారు. ఫేస్ రికగ్నిషన్ కూడా ఏర్పాటు చేశారు.