బాబుకు ఐటీ నోటీసులు.. ఆర్కే గొంతు పెగలదేం?
నిజానికి వైసీపీ వాళ్ల మాట ప్రకారం ఇన్కమ్ టాక్స్ వాళ్ళు నడిచేటట్టు ఉంటే కనుక టిడిపిలో ఏ ఒక్కరిని వదలకుండా టార్గెట్ చేసే వారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడితో ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఎవరికైనా నోటీసులు ఇచ్చారంటే ఆ మాటలో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి. 2019లో జరిగిన సోదాలలో షాపోంజి, పల్లాంజి దగ్గర చంద్రబాబు విషయాలు దొరికితే 2020వరకు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా ఆపారు వాళ్ళ మనుషులు.
అయితే 2020 నుంచి 2023 వరకు నాలుగు సార్లు చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తొణకకుండా తాను లంచం తీసుకోలేదని చెప్పడం మానేసి, అడగటానికి మీరెవరు అన్నట్లుగా మాట్లాడారట. ఆయన అలా దబాయించేసరికి ముఖ్యమంత్రి స్థానంలో గతంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి మనకెందుకులే గొడవ అని వాళ్ళు చట్టాలన్నీ లెక్కేసుకుని తమకు తామే సమాధానాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
దీంతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా మా పై వాళ్లు మిమ్మల్ని ప్రశ్నించమంటే ప్రశ్నించాం తప్ప మరొకటి కాదని, కాబట్టి సమాధానం ఇవ్వండి అని చెప్పడం జరిగిందట. దానిని బట్టి చంద్రబాబు ఆ తర్వాత సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి వ్రాయాలి కదా అని అడుగుతున్నారు కొంత మంది.