మణిపూర్‌ హింసకు అదే అసలు కారణమా?

Chakravarthi Kalyan
మణిపూర్ అల్లర్ల వెనకాల బర్మా అలియాస్ మయన్మార్ నుంచి వచ్చిన వ్యక్తుల హస్తం ఉందని అంటున్నారు. అయితే దీని వెనకాల చైనా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మయన్మార్ నుంచి వలస వచ్చిన వ్యక్తులు దారుణాలకు ఒడిగట్టారని సమాచారం. బంగ్లాదేశ్ నుంచి వచ్చి  పశ్చిమ బెంగాల్ లో విధ్వంసం సృష్టించిన వారిలాగే.. జమ్మూ కాశ్మీర్ కు పాకిస్థాన్ నుంచి వచ్చి దాడులు చేసినట్లే.. మణిపూర్ కు కూడా మయన్మార్ కు వచ్చిన వారు తీవ్ర విధ్వంసం సృష్టించారని తెలుస్తోంది.

మణిపూర్ లో అల్లర్లకు కారణం మయన్మార్ నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ అన్నారు. అయితే అస్సాం రైఫిల్స్ ను సీఎం బీరెన్ సింగ్ హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండాలని అస్సాం రైఫిల్స్ పేరుతో మారు వేషాలతో మైతిల మీద దాడులు చేస్తున్నారని ఇది తెలియని చాలా మంది అస్సాం రైఫిల్స్ వారే మైతి తెగల మీద దాడులు చేస్తున్నారని అనుకుంటున్నారు.

అయితే అసలు విషయం అస్సాం రైఫిల్స్ వాహనాల్లో అదే విధంగా ఆర్మీ డ్రెస్ వేసుకుని ఉగ్రవాదులు మయన్మార్ నుంచి మైతి తెగలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయం తాజాగా బయటపడడంతో జాగ్రత్తగా ఉండాలని అస్సాం రైఫిల్స్ ను సీఎం బీరెన్ సింగ్ హెచ్చరించారు. అయితే మయన్మార్ బార్డర్ లో దాదాపు ఫెన్సింగ్ ఇంకా 70 కిలో మీటర్ల వరకు పూర్తి కావాలి.

ఉగ్రవాదులు ఈ దారి గుండానే మణిపూర్ లోకి చొరబడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి దీన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ఉగ్రవాదుల రాక తగ్గి పోతుంది. ఆటోమెటిక్ గా దాడులు తగ్గిపోతాయి. విధ్వంసాలు ఆగిపోయి శాంతి చేకూరుతుందని భావిస్తున్నారు. మణిపూర్ లో మొత్తం మీద విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులు మయన్మార్ నుంచి వచ్చిన కుకి తెగలకు సంబంధించిన వారేనని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: