చైనా సరిహద్దులోకి బలగాలు తరలిస్తున్న ఇండియా?
ఈ విషయంలో భారత్ చాలా వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఎప్పుడూ రక్షణ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడే భారత్ ఈ సారి దేశీయ పరిజ్ఞానాన్ని నమ్ముకుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చైనాతో పాటు అమెరికా భావిస్తోంది. భారత్ ఎదుగుదలను చూసి మనకు తోడు ఉండాలని అమెరికా చూస్తోంది. ఎందుకంటే అమెరికా ప్రజల దృష్టిలో చైనాను దెబ్బకొట్టాలి కాబట్టి. దీనికి మొక్కుబడిగా పలు ఆంక్షలను విధించారు. ట్రంప్ సమయంలో అమెరికా నుంచి బయటకు వచ్చేందుకు పలు కంపెనీలు సిద్ధపడ్డాయి. ఆ సమయంలో జపాన్ మాత్రమే వెనక్కి వచ్చింది. మిగతా యూరప్ దేశాల కంపెనీలు ఇంకా 90 శాతం అమెరికాలోనే ఉన్నాయి.
మోదీ మళ్లీ గద్దెను ఎక్కితే ప్రపంచంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎన్నికల ముందు చైనా యుద్ధ వాతావరణం సృష్టించి 1962లో నెహ్రూని దెబ్బకొట్టిన విధంగా చేస్తే బీజేపీ ని ఎదగనీయకుండా చేయవచ్చు అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి తెరవెనుక అమెరికా కూడా సహకరిస్తోంది అనే వాదన ఉంది. దీనికి ప్రతిగా చైనా సరిహద్దుల్లో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 400 ఆర్టిళరీ గన్స్ ను ఇండియా మోహరించనుంది.