బాబును కాపాడే దమ్మున్న ఏకైక లాయర్ అతడే?
ఇప్పటి వరకు ఎన్టీఆర్ విషయంలో కానీ టీడీపీ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నారని కానీ అవినీతికి పాల్పడినట్లు ఎక్కడ వినిపించిన దాఖలాలు లేవని రాధాకృష్ణ ఏదీ న్యాయం అనే వ్యాసంలో అన్నారు. అయితే ఎన్టీఆర్ హాయాంలో అల్లుండ్లను దగ్గరగా ఉంచుకుని కొడుకులను రాజకీయాల్లోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పని చేసిన వారి కుమారులకు ఎలాంటి వ్యాపారాలు లేవు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా చేసిన సమయంలో జగన్ మాత్రం వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు.
అయితే ఈ విషయంలో కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, రోశయ్య కుమారులకు వ్యాపారాలు ఉన్నాయి. వారు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. కానీ కేవలం జగన్ ఒక్కడే వ్యాపారాలు చేస్తున్నట్లు ఆర్ కే విశ్లేషించడం ఎంత వరకు సబబు. ప్రతి ఒక్కరు వ్యాపారాల చేసేవారే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అమాంతం విస్తరించుకున్నారు. అయితే చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిచెస్ట్ సీఎం ఆయనే.. ప్రస్తుతం రిచెస్ట్ ప్రతిపక్ష నేత కూడా చంద్రబాబు నాయుడే. ఈ విషయంలో ఆర్ కె చెబుతున్న విషయాలను ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఒకరిపై ప్రేమగా మరొకరిపై కక్షతో రాస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్నారు.