పాకిస్తాన్ ముష్కరుల్లో మోదీ ప్రాణభయం?
భారత్ లో చిచ్చు రేపి దర్జాగా బతికేస్తాం అనుకునే వారు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ తప్పుడు పని చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా బతకాలన్నా వణికిపోయేలా భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమకారులు ఎక్కువగా ఉన్నారు. వీరిని అక్కడి ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక దేశంలో మరో దేశానికి వ్యతిరేకంగా జెండాలు పట్టుకుని ధర్నాలు, నిరసనలు చేస్తుంటే వారిని పట్టుకుని అరెస్టు చేయాల్సింది పోయి వారికి అనుకూలంగా మాట్లాడటం కెనడా ప్రధానికే చెల్లింది.
భారత్ లో చిచ్చు రేపేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఖలిస్తాన్ టెర్రరిస్టులు ఆరుగురు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో కాల్పుల్లో చనిపోయారు. అయితే కెనడా మాత్రం ఇండియా ఎజెంట్లే ఈ హత్యలు చేసినట్లు ఆరోపిస్తుంది. అయితే ఖలిస్తాన్ తీవ్ర వాదులు ఇండియాలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఎన్ని సార్లు చెప్పినా కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఒక టెర్రరిస్టు ఎవరో కాల్పుల్లో చనిపోతే మాత్రం అది భారతే చేయించింది. మా కెనడా జాతీయుడిని చంపించింది భారత్ అని గగ్గోలు పెడుతున్నారు. పోనీ కెనడా జాతీయుడికి ఖలిస్తాన్ ఉద్యమం తోని ఏమీ పని? ఎందుకు ఖలిస్థాన్ ఉగ్ర వాదాన్ని పెంచిపోషిస్తున్నారు.. ఒకప్పటి పాకిస్థాన్ లా కెనడా ఎక్కువగా ఉగ్ర వాదులను పెంచి పోషించి తన గోతిని తానే తవ్వుకుంటుంది.