ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సేఫ్ అయినట్టేనా?
అనంతరం ఆయన్ను డైరెక్టుగా అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ సింగ్ అరెస్టుతో ఢిల్లి లిక్కర్ కేసులో ఆప్ కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈయన్ని కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే లిక్కర్ కేసులో ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈయనతో పాటు మరో నేత మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టు అయ్యారు.
మనీశ్ సిసోడియా ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయ్యారు. ఈ కేసులో అరెస్టయి అప్రూవర్ గా మారిన దళారి గిరీష్ ఆరోరా స్టేట్ మెంట్ ఆధారంగా ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది. 2020 లో ఒక రెస్టారెంట్ లో సంజయ్ సింగ్ ను కలిసినట్లు గిరిష్ ఆరోరా తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో రెస్టారెంట్ల ఓనర్ల నుంచి నిధులు సేకరించాలని సంజయ్ కోరినట్లు అప్రూవర్ గిరిశ్ ఈడీకి వివరాలు వెల్లడించాడు. ఈ మేరకు రూ.82 లక్షల చెక్ ఇచ్చినట్లు తెలిపారు.
అమిత్ అరోరా అనే వ్యక్తి అప్పటి ఎక్సైజ్ మంత్రి మనీశ్ సిసోడియాకు చెప్పి మద్యం దుకాణాన్ని షిప్ట్ చేయించినట్లు చెప్పారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఆయన ఇంట్లోనే కలిసినట్లు తెలిపారు. అయితే సంజయ్ అరెస్టును ఆప్ తీవ్రంగా ఖండించింది. అదానీ గ్రూపు అక్రమాస్తులపై రాజ్యసభలో సంజయ్ మాట్లాడినందుకే బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శలు చేస్తోంది.