చంద్రబాబును భయపెడుతున్న మరో కీలక కేసు?

Chakravarthi Kalyan
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సమయం చంద్రబాబుది. 14 ఏళ్లు సీఎం, ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయ్యారు. ఇప్పటి వరకు ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా ఏదీ నిరూపితం కాలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఆయనపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఎప్పుడో మరుగున పడ్డ ఓటుకు నోటు కేసు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.


వైసీపీ ఎమ్మెల్యే మంగళవారం ఓటుకు నోటు విషయమై రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు చేర్చాలని ఒకటికాగా.. మరొకటి తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి అప్పగించాలని మరొకటి దాఖలు చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి డబ్బులు ఇస్తూ పట్టుబడినట్లు ఏసీబీ ప్రకటించింది. తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు అని రేవంత్రెడ్డి ఆరోపించారు. అయితే 2021లో దాఖలు చేసిన ఈడీ దాఖలు చేసిన ఛార్జి షీట్లో చంద్రబాబు పేరు లేదు.


అయితే ఈ కేసు విచారణ సందర్భంగా తమ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూధ్రా అందుబాటులో లేరని ఈ కేసును నెలరోజుల పాటు వాయిదా వేయాలని కోరారు.  గతంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూధ్రా వినిపించి వాదనలు ఆయన చేతికి మట్టి అంటకుండా చూశారు.  ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో సహా అన్నింటిని సిద్ధార్థ్ లూధ్రానే హ్యాండిల్ చేస్తున్నారు.  


హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ లు ఉన్నా ఆయన పర్యవేక్షణలోనే విచారణ సాగుతుంది. ఇది సాధారణ కేసు అయితే సిద్దార్థ్ లూధ్రా హాజరు అయి కేసు వాదించేవారు. దీనికి చాలా హోం వర్క్ చేయాలి .. లేదా ఈ కేసు కూడా చుట్టుకునే అవకాశం ఉండటంతో కావాలనే వాయిదా అడిగినట్లు పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: