ప్రపంచానికే సవాల్: ఒక్కటైతున్న 86 టెర్రరిస్టు గ్రూపులు?
అయితే చాలా వరకు క్రైస్తవ దేశాల్లో దాడులు చేసి వాటిని ఇస్లాం దేశాలుగా మార్చాలని చూస్తున్నారు. ప్రపంచంలోని 83 ఉగ్రవాద సంస్థలు ఒక్కటవుతున్నాయని ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాల అధినేత మీటింగ్ లో జరిగిన చర్చలో ఈ విషయం చర్చకు వచ్చింది. మొన్నటి వరకు ఫ్రాన్స్ లో అంతర్గతంగా జరిగిన గొడవల్లో అనేక షాపులను లూటీ చేయడం.. వాటిలో సామాన్లను ఎత్తుకెళ్లడం.. కాల్చి వేయడం.. ఇళ్లపై దాడులు చేయడం.. కొంతమంది రాజకీయ నాయకుల ఇళ్లను తగలబెట్టడం లాంటి అనేక విధ్వంసం జరిగింది.
ఫ్రాన్స్ దేశంలో ఆశ్రయం పొందిన వారు మత రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. దీంతో అనేక దాడులను ఫ్రాన్స్ ఎదుర్కొవాల్సి వస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువేల్ మెక్రాన్ అన్నారు. అంటే ఫ్రాన్స్ లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు వలస వచ్చి ఆశ్రయం పొందిన కొంతమంది వ్యక్తులు చేస్తున్న అరాచకం అని చెప్పారు. ఇలాంటి వారి వల్ల అనేక దేశాలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న కూకటివేళ్లతో పెకిలించేస్తేనే మనిషి మనుగడకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తుంది. వారిపై పై చేయి సాధించి హమాస్ ను పూర్తిగా ఓడించాలి. తద్వారా మరి కొందరు ఇలాంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు వెనకంజ వేస్తారు. ప్రపంచంలో ఉగ్రవాద భావజాలాన్ని అంతమొందించాలి లేకపోతే రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ దేశాలు మరిన్ని దాడులు ఎదుర్కొక తప్పదు.