భువనేశ్వరిని ఆ ప్రశ్నలు అడిగితే..?
అయితే ఈ సభలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగల పూడి అనిత భువనేశ్వరీని ప్రశ్నిస్తూ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 2021 లో కేసు నమోదు చేశారు. అందులో ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేదు. కానీ ఆయన పేరు లేకుండానే ఇప్పుడు అరెస్టు చేశారు. అందులో మొదట రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. ప్రస్తుతం 27 కోట్లు అని అంటున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు. ఇలా ఆ పార్టీ లీడరే భువనేశ్వరీని ప్రశ్నించడం కాస్త గందరగోళానికి గురి చేస్తుంది.
45 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచారు ఆయన ఆరోగ్యం ఏమయిపోతుందో అని రాజేశ్వరీ అనే టీడీపీ కార్యకర్త అడిగితే.. నాలుగేళ్ల నుంచి కేసులు కనిపించ లేదా చివర్లో ఎన్నికలు వస్తున్నాయనగా ఇప్పుడు అరెస్టు చేయడంలో అర్థం ఏమిటి అని గిరిజ అనే మరో మహిళ కార్యకర్త ప్రశ్నించారు. ఈ కష్టకాలాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారని మరో మహిళ అడిగారు. చంద్రబాబుకు ఇంటి నుంచి పంపించే భోజనాన్ని కూడా అనుమానిస్తున్నారు అని అనురాధ అనే టీడీపీ ఎమ్మెల్సీ ఆరోపించింది.
ఒక ఎంపీ హత్యకేసులో సీబీఐ పేరు నమోదు చేసిన కూడా ఆయన్ని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడుని 40 ఏళ్ల సీనియర్ నాయకుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం బాధకరమని వాపోతున్నారు. కానీ సిమెన్స్ సంస్థ ఉందా దానికి డబ్బులు ఇచ్చారా లేదా అని మాత్రం ఈ మహిళ నాయకురాళ్లు అడగడం లేదని ప్రజలు వీరిని ప్రశ్నిస్తున్నారు.