అమెరికాకే చుక్కలు చూపిస్తున్న ముస్లిం దేశాలు?
ఇవి రెండు దాడులగా కాకుండా యుద్ధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇరువురు ఒకరిపై ఒకరు బాంబుల దాడులను కొనసాగిస్తున్నారు. వాస్తవానికి హమాస్ తీవ్రవాదులు వర్సెస్ ఇజ్రాయెల్ గా చెప్పాలి కానీ పాలస్తీనా తో అని చెబుతున్నారు. ఇవే కాకుండా మరో రెండు యుద్ధాలు చేసేందుకు ఆయా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అవి తైవాన్ పై చైనా… దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా. ప్రస్తుతానికి ఇరు దేశాలు దాడులు చేసుకోవడం లేదు కానీ.. యుద్ధ సన్నాహాలు మాత్రం మొదలు పెట్టాయి.
సిరియాలోని అమెరికా స్థావరాలపై హౌతీ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ హౌతీ తీవ్రవాదులకు ఇరాన్ మద్దతుగా ఉంటుంది. దీనికి బదులుగా అమెరికా వాళ్లకి సంబంధించిన శిబిరాలపై దాడులు చేసింది. ఇరాన్ కి సంబంధించిన ఆయా దళాలు అమెరికా స్థావరాలపై తమ యుద్ధ విమానాలతో బాంబు దాడి చేసింది.
ఇప్పుడు అమెరికా చూస్తూ ఉంటుందా. ప్రతి దాడి కచ్చితంగా చేస్తోంది. చిన్నగా మొదలైన ఈ దాడులు సిరియాపై అమెరికా దాడిలా మారిపోతుంది. మూడో యుద్ధంగా అవతరించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ పాలకుడికి జో బైడెన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దళాలకు ఎదురొస్తే తగిన రీతిలో స్పందిస్తామని అందుకు సిద్ధంగా ఉండాలని అయాతుల్లాను హెచ్చరిస్తున్నా అని పేర్కొన్నారు. తమ దేశానికి ఆత్మరక్షణ ఎప్పుడూ ఉంటుందని.. దాడి డ్రోన్లతోనా.. రాకెట్లతోనా అనేది త్వరలో నిర్ణయిస్తామని అమెరికా తెలిపింది.