బాబు బాగోతం: షేక్‌పేటలో ఎకరం రూ.8500 మాత్రమే?

Chakravarthi Kalyan
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి 100పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానానికి  అయినా జనాలు థియేటర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయకపోయినా వార్తల్లో నిలుస్తున్నారు.


అయితే.. చంద్రబాబు జైలు వ్యవహారంలో ఆయన పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీడీపీకి మద్దతుగా  లోకేశ్ పిలుపునచ్చిన నిరసనల్లో పాల్గొన్నారు. సీన్ కట్ చూస్తే ప్రస్తుతం ఆయన కోర్టు కేసులతో వార్తల్లో నిలిచారు. తాజాగా విలువైన భూమి విషయంలో తెలంగాణ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఏరియాలోని షేక్ పేటలో రెండెకరాల భూమిని ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కేటాయించింది.


ఈ భూమిని దర్శకుడు రాఘవేంద్రరావు తో సహా ఇతరులు తన అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ భూమిని టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎకరం రూ.8500 చొప్పున రెండెకరాలను సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించింది. దీనిపై అప్పట్లో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిపై 2012 వరకు విచారణ కూడా జరగలేదు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇన్ని రోజులుగా దీనిపై విచారణ ఎందుకు జరగలేదు అని ప్రశ్నించింది. మాకు నోటీసులు రాలేదని ఆయన తరఫు లాయర్లు వాదించారు. ప్రస్తుతం ఆ రెండెకరాల స్థలంలో పబ్బులు, బార్లు, ఇతరత్రా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.


అప్పట్లో ఎకరం రూ.8500 కి అప్పజెప్పిన భూమి ప్రస్తుత ధర రూ.150 కోట్లకు పైమాటే. సినీ పరిశ్రమ అభివృద్ధి పేరుతో తక్కువ రేటుకు భూమిని చేజిక్కించుకొని.. దానిని తన అవసరాలకు వాడుకుంటున్నారు అని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు సినీ పరిశ్రమకు ఆయన చేసిన మేలేంటో చెప్పాలని పలువురు రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. అందుకే టీడీపీకి మద్దతిచ్చారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: