రేవంత్‌రెడ్డి కేసును భలేగా కవర్ చేసిన ఏబీఎన్ ఆర్కే?
ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏబీఎన్ వేమూరి రాధాకృష్ణతో ఇంటర్వ్యూకి ఓకే అనేశారు. అనుకున్నట్లు గానే కొన్ని ప్రశ్నలను సంధించారు. అయితే ఏబీఎన్ టీడీపీకి అనుకూలంగా వార్తలు రాస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ అయితే అక్రమాస్తుల కేసులో అరెస్టు అని చంద్రబాబు అయితే అక్రమ అరెస్టు అని రాస్తూ ఉంటుంది.
మంత్రి కేటీఆర్ తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు కదా అని ఆర్కే అడిగితే దానికి కేటీఆర్ మాకు ఆనాడు చంద్రబాబు బహుమతి ఇచ్చారు. తిరిగి ఆయన కి కూడా మేం తిరిగి బహుమతి ఇచ్చాం. అంతే ఇప్పటికీ మా మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. లోకేశ్, నేను మంచి స్నేహితులం. ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా మేం మాట్లాడుకునే ఉంటాం. మరొకటి ఓటుకు నోటు కేసు వెలికితీయాలని కేసీఆర్ ను జగన్ కోరారు కదా అని అడిగితే దానికి సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని కక్ష సాధింపు చర్యలు తెలంగాణ సంస్కృతి కాదు అని చెప్పినట్లు వివరించారు. వాస్తవానికి అప్పుడు ఓటు కి నోటు కేసులో టీడీపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తెలంగాణలో టీడీపీ కార్యక్రమాలు చేపట్టకూడదని.. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో తల దూర్చకూడదని ఒప్పందం కుదిరిందని చెబుతారు.. కానీ దీనిని కక్ష సాధింపు చర్య అంటూ తెలివిగా పక్కకు తప్పించారు ఆర్కే.