మందుబాబుల కోసమే జగన్ ఆ సంచలన నిర్ణయం?
కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గడం వెనుక అసలు మర్మం ఏమిటీ. ధరలు తగ్గితే ఆయా బ్రాండ్ల విక్రయాలు పెరిగి ఆయా సరఫరా దారుల ఆదాయం మరింత పెరుగుతుంది. తద్వారా తమకు కావాల్సిన వాళ్లకు మేలు చేయోచ్చని జగన్ సర్కారు ఈ ఎత్తుగడను అమలు చేసినట్లు తెలుస్తోంది. మరో పత్రికలో ఈ పెంపు నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. 250 రకాల మద్యం బాటిళ్ల ధరలు తగ్గించడం వల్ల ఆ బ్రాండ్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కో సీసాపై రూ.330 కొన్నింటిపై రూ.320, రూ.180, రూ.90 తగ్గే అవకాశం ఉంది. తద్వారా ఆయా కంపెనీల విక్రయాలు పెరిగి వాటికి లాభాలు వచ్చే అవకాశం. సొంత వారికి లాభం చేకూర్చేందుకు జగన్ సర్కారు ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి పెడుతోందని రాశాయి.
దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే మొన్నటి వరకు ఆదాయం రాబట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం మద్యం రేట్లు విపరీతంగా పెంచింది. మళ్లీ ఎన్నికలు దగ్డర పడుతున్నాయి. ఇప్పటికే మద్యం విధానాలపై అక్కడి మందుబాబుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనిని కొంతమేర తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.