న్యాయ మూర్తులను అంతగా వేధిస్తున్నారా?

Chakravarthi Kalyan
సాధారణంగా దిగువ కోర్టుల్లో పనిచేసే మేజిస్ట్రేట్ లను న్యాయాధికారులు అంటారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ల్లో జడ్జిలు అని పేర్కొంటారు. మన సాధారణ పరిభాషలో వీరందరినీ న్యాయమూర్తులు అనే అంటుంటాం. ఉద్యోగం లో ఉన్నంత వరకు వారు పలువురు నిందితుల విషయంలో అనేక తీర్పులు ఇస్తుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత వాళ్ల జీవితాలకు ప్రభుత్వాలు తీర్పును ఇస్తున్నాయి.


పెన్షన్ చెల్లింపులు, సదుపాయల కొరతలో కోతలు విధించడం వంటివి చేస్తున్నాయి. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయాధికారులకు గౌరవ ప్రదమైన సౌకర్యాలు, పని వాతావరణం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వనరుల కొరతను సాకుగా చూపి పదవీ విరమణ అనంరతం వారికి దక్కాల్సిన ప్రయోజనాలను నిరాకరించజాలరని పేర్కొంది. వివాద పరిష్కారాన్ని కోరే పౌరులు మొదట ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థల సభ్యులనేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గుర్తు చేసింది.


చట్టబద్దమైన పాలనపై సామాన్య పౌరుల్లో విశ్వాసాన్ని పరిరక్షించడానికి న్యాయ స్వతంత్రత చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది. గౌరవప్రదమైన ఆర్థిక స్థితిగతులతో జడ్జిలు తమ జీవితాలను సాగించగలిగనప్పుడే అది సాధ్యమని తెలిపింది. న్యాయ సేవకు జడ్జిలు చాలా సమయం కేటాయిస్తారు. కోర్టు సమయం ముగిశాక కూడా వారు పనిచేయాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు కొన్ని సార్లు కుటుంబంతో గడిపే విలువైన సమయాన్నికూడా కోల్పోతుంటారు.  పదవీ విరమణ తర్వాత వారు గౌరవ ప్రదమైన జీవనాన్ని సాగించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది అని వివరించింది.


న్యాయాధికారులు వేతనాలు, సర్వీసులు నిబంధనలపై అఖిల భారత జడ్జిల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జాతీయ జ్యూడిషయల్ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా దిగువ కోర్టుల న్యాయమూర్తులకు వేతన బకాయిలను చెల్లించని రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల చివరి అవకాశాన్ని ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

LAW

సంబంధిత వార్తలు: