సెక్రటేరియట్‌లో ఎవరు ఎక్కడో తేల్చేసిన సీఎం రేవంత్?
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు రెండో ఫ్లోర్‌లో 13, 14, 15 గదులను కేటాయించారు. రహదారులు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయిదో అంతస్తు రూమ్ నంబరు 10,11,12 గదులు ఇచ్చారు. ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు రూమ్ నంబరు 10, 11,12 గదులు ఇచ్చారు.
రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్‌లో రూమ్ నంబరు 10,11,12 గదులను కేటాయించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అయిదో ఫ్లోర్‌లో 27, 28, 29 గదులను కేటాయించారు. అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాలుగో ఫ్లోర్‌లో 10, 11, 12 గదులను ఇచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఇక పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు మొదటి ఫ్లోర్‌లో 27, 28, 29 గదులను కేటాయించారు. వ్యవసాయం, మార్కెటింగ్ హ్యాండ్ లూమ్ టెక్స్‌టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మూడో ఫ్లోర్‌లో 27, 28, 29 గదులను కేటాయించారు. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నాలుగో ఫ్లోర్‌లో రూమ్ నంబరు 13, 14, 15 గదులను కార్యాలయ చాంబర్ల నిమిత్తం కేటయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తన ఆదేసాల్లో పేర్కొన్నారు.