ఉపాధ్యాయులకు జగన్ ఏం సమాధానమిస్తారో?
ఉరవకొండ మండలం చిన్న మస్తూరుకు చెందిన టీచర్ మల్లేశ్ సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ మనస్తాపానికి గురై విషపు గుళికలు మింగారు. తన చావుకు సీఎం జగన్ కారణం అంటూ ఐదు పేజీల లేఖ రాశాడు. సీపీఎస్ రద్దు, అయిదో తేదికల్లా జీతాలివ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో ప్రస్తావించారు.
ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే వైఎస్ జగన్ పై ఉన్న పిచ్చి అభిమానమే నా పాలిట మరణ శాసనం అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అని తోటి ఉద్యోగులతో తరచూ గొడవ పడేవాడిని. మాట తప్పం మడిమ తిప్పం అని చెప్పి సీపీఎస్ రద్దు గురించి పలు సార్లు హామీ ఇచ్చారు. ఈ మాట నమ్మి మా కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు కూడా వేయించాం.
ఒక నెల, రెడు నెలలు ఆలస్యం అయితే తట్టుకోవచ్చు. ప్రతినెల ఆలస్యం కావడంతో ఈఎంఐలు, చిట్టీలు కట్టలేకపోతున్నాం. ఇట్టు కట్టుకోవడం నా చిరకాల కోరిక. దానిని నెరవేర్చుకోలేకపోతున్నా. చంద్రబాబు 43శాతం ఫిట్ మెంట్ ఇస్తే అంతకు మించి ఇస్తారనుకున్నాం. కానీ 23 శాతమే ఇచ్చారు. రెండు డీఏలు పెట్టినందుకే చంద్రబాబుని కాదనుకున్నాం. కాదన్నందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం. ప్రతి విషయంలో జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని నిరూపిస్తున్నారు అని నాలా ఏ ఉద్యోగి కావొద్దని ఆలోచించి ఓటేయాలని కోరారు. మరి దీనిపై జగన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.