కాశ్మీర్ సమస్య మోదీకి ఓట్లు తెచ్చిపెడుతోందా?
తాజాగా ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ అత్యున్నత ధర్మాసరం తీర్పును వెలువరించింది. దీనిపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అయితే గతంలో 2019 ఎన్నికలకు ముందు మోదీ సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ద విమానాల్లో కుంభకోణం జరిగింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విమానాల్లో భారీ అవినీతి జరిగింది అని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాస్తవానికి దీనిపై విచారించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మోదీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఇది ప్రధాని కి బూస్ట్ ఇచ్చినట్లయింది. భారీ మోజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు విషయంలోను అదే జరిగింది. కశ్మీర్, లద్దాఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో పాటు పునర్విభజన జరిగిన నేపథ్యంలో వీటన్నింటిని సవాల్ చేస్తూ పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
అయితే వీటన్నింటిని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 రద్దు సబబే అని మోదీ నిర్ణయాన్ని సమర్థించింది. ఇది ఎన్డీయే కూటమికి అతి పెద్ద ఊరట. దీనిపై కాశ్మీర్ నేతలు మినహా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 2019లో మాదిరిగా 2024 ఎన్నికల్లోను ఈ అంశం మోదీకి కలిసివచ్చి మరోసారి ప్రధాని అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.