మిస్టరీగా మారిన టీడీపీ పొత్తులు యవ్వారం?

Chakravarthi Kalyan
నవంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా పదవి ప్రమాణం చేయడం జరిగింది. అయితే వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఇప్పుడు  జనాల ఆలోచన  నెమ్మదిగా ఆంధ్ర ప్రదేశ్ వైపుగా మళ్ళుతుంది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే విషయంపై చర్చలు వాడిగా జరుగుతున్నాయి.


దానికన్నా ముందు ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లబోతుంది అనే దానిపైనే ఇప్పుడు జోరుగా చర్చలు మొదలవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైన చర్చ భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ లపై జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చింది. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందా లేదా అనేదే ఇప్పుడు అసలైన డిస్కషన్.


గతంలో 1999 అలాగే 2014లో కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగింది. సాధారణంగా అయితే తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతోనూ, టిఆర్ఎస్ పార్టీలతో మాత్రమే పొత్తు పెట్టుకునేది. కానీ కాంగ్రెస్ తో మాత్రం తెలుగుదేశం పార్టీకి  సంబంధాలు లేవు. మరి ఇప్పుడు తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతునిస్తోందా, ఒకవేళ కాంగ్రెస్ కు మద్దతునిస్తే భారతీయ జనతా పార్టీ తో పొత్తు అనే విషయం పరిస్థితి ఏమిటి అని కొంతమంది సందేహం.


ఒకవేళ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేలా ఉంటే భారతీయ జనతా పార్టీతో ఖచ్చితంగా సంబంధాలు కొనసాగించదు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డిని వోన్ చేసుకుంటుంది. మరోపక్క  చంద్రబాబు నాయుడు  అరెస్ట్ అయిన సింపతి తో ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచేస్తుందని  మరికొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: