జగన్‌కు పరీక్ష పెడుతున్న పవన్..?

Chakravarthi Kalyan
జనసేన నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతుందనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, బీసీ, కాపుల కాంబినేషన్ తో ముందుకు సాగాలని ఎక్కువగా ఓట్లు సాధించాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. తెలుగు దేశంతో పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లు తీసుకుంటుందనేది ఒక ఎత్తయితే.. ఇచ్చిన సీట్లలో ఎస్సీ, బీసీ, కాపులకు ఎన్ని ఇస్తారనేది పవన్ కల్యాణ్ ముందున్న సవాల్.


సీట్ల పంపకంలో ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఎం జగన్ వైసీపీ తరఫున ఎస్సీ, బీసీ, ఎస్టీలకు కూడా ఎక్కువగా సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రాక్టికల్ గేమ్ ఆడుతున్న జగన్ బీసీలకు ఎక్కువగా సీట్లు ఇస్తాం. అసెంబ్లీ పరంగా రిజర్వేషన్లు బీసీలకు ఉండవు కాబట్టి వారికి ఎక్కువగా సీట్లు ఇచ్చి ముందుకు సాగుతామని చెబుతున్నారు.


ఓవరాల్ గా జగన్ బీసీ మంత్రం జపించడంతో ప్రస్తుతం చంద్రబాబు ముందు పెద్ద లక్ష్యమే కనిపిస్తోంది. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లను బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. జగన్ వేసిన ఎత్తుగడను అర్ధం చేసుకుని ఎక్కువగా సీట్లు ఇస్తే అధికారం రాదోమోననే భయం. ఒకవేళ ఇవ్వకుండా ఉంటే వైసీపీ చేసే విమర్శలను ఎలా తట్టుకుని ముందుకు వెళ్లాలో.. బీసీల ఓట్లు ఎలా అడగాలో ఇప్పుడు పవన్ కల్యాణ్, చంద్రబాబు ముందున్న ప్రశ్న.


ఒక అధికార పార్టీలో ఉన్న నాయకుడు ప్రతిపక్షాలను ఈ రకంగా కూడా ఆత్మరక్షణలో పడేయగలడని సీఎం జగన్ నిరూపిస్తున్నారు. అయితే బీసీ, ఎస్సీ, కాపులకు టీడీపీ, జనసేన ఎన్ని సీట్లు ఇస్తాయనేది ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్నారు. ఒకవేళ సరైన న్యాయం జరగకపోతే బీసీల ఓట్లు పడకుండా చేస్తామని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే బహిరంగంగానే చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: