పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌కు పెద్ద దెబ్బ?

Chakravarthi Kalyan
తెలంగాణ లో శాసన సభ సమరం ముగిసింది.  కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి అధికారాన్ని హస్త గతం చేసుకొంది. ఇప్పుడు అందరి చూపు లోక్ సభ ఎన్నికలపై పడింది. ఈ సారి అధికారి కాంగ్రెస్ కు ఎన్ని స్థానాలు వస్తాయి.. ప్రతి పక్ష బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందా.. లేక చాపకింద నీరులా  పుంజుకుంటున్న బీజీపీ ఈ రెండు పార్టీలకు షాక్ ఇస్తుందా అనే ప్రశ్నలు పలువురిలో మెదులుతున్నాయి.


జాతీయ స్థాయిలో సర్వే లు  చేసే టౌమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ తాజాగా లోక్ సభ ఎన్నికల స్థానాలపై తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఒక్క ఛత్తీస్ గఢ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఆసర్వే సంస్థ చెప్పిన ఫలితాలు నిజం అయ్యాయి.  ఇందులో తెలంగాణలో కేసీఆర్ కు భారీ ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేసింది.


బీజేపీ గతం కన్నా తమ బలాన్ని పెంచుకోగా.. ఈ సారి కాంగ్రెస్ భారీగా పుంజుకొందని తెలిపింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గానూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 3-5స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది.  గతంలో 2014లో 12 స్థానాలు గెలిచిన ఆ పార్టీ 2018 ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితం అయింది. ఈ సారి ఏకంగా  5 స్థానాలు మాత్రమే పొందుతుందని చెప్పింది. ఇది ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ కు భారీ ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.


అదే సందర్భంలో గతంలో 3 స్థానాలకు పరిమితం అయిన కాంగ్రెస్ ఈ సారి పుంజుకొని 8-10 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. కిందటి సారి ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ తిరిగి తమ స్థానాలు నిలబెట్టుకోవడమే కాకుండా మరో స్థానం అదనంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. చూద్దాం ఏం జరుగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: