జగన్‌పై జోరు పెంచేసిన ఎల్లో మీడియా?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు ముఖ్యమైన పార్టీలే. వైసీపీకి సాక్షి మీడియా ఉంది. అలాగే తెలుగు దేశానికి అనుకూల మీడియాలుగా కొన్ని పత్రికలు, ఛానళ్లు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు అన్నీ కూడా ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేయబోతాయని అంటున్నారు కొంతమంది.
ఇక రానున్న నెలల్లో రోజుకో ప్రజా సమస్యను వీళ్ళ మీడియా మాధ్యమంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారు. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి సమస్యలను వీళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అంతే కాకుండా అణిగి ఉన్న సమస్యలను తట్టి లేపుతూ ఉంటారు. జగన్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ సమస్య ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుందని కొంతమంది భావన. దాంతో ఇక్కడ యువత జాబు లేక ఇబ్బంది పడుతున్నారు అంటూ హైలెట్ చేస్తారు.
అంతే కాకుండా బాబు వస్తే జాబు వస్తుందన్నట్లుగా గతంలో చేసిన విధంగా తిరిగి ప్రచారం చేస్తారు. అంగన్వాడి సమస్య అని, నిరుద్యోగ సమస్య అని వీళ్లు రోజుకో సమస్యని హైలెట్ చేసుకుంటూ వస్తారు. ఆందోళనలు, ఉద్యమాలు చేస్తారు. ఒకవేళ పోలీస్ యంత్రాంగం గనుక వీరిపై చర్యలు తీసుకుంటే ప్రజలపై ప్రభుత్వ దౌర్జన్యం అంటూ ప్రచారం చేసుకొస్తారు. ఒకవేళ పట్టించుకోకపోతే ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ వాపోతారు.