బాబు, పవన్ నాన్ లోకల్ అవుతారా? జగన్ వాదన కరెక్టేనా?
ఉత్తరాంధ్రలోని , కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానంటే.. తట్టుకోలేక టీడీపీ ఏడుపు రాజకీయాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తానంటూ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ లో సొంత నియోజకవర్గం కూడా లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మరోవైపు ఉత్తరాంధ్రకు వచ్చి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ది చేస్తానంటే వీరంతా హైదరాబాద్ లో ఉండి అడ్డుకుంటారు అంటూ విరుచుకుపడ్డారు. అయితే చాలామంది ఏపీ నాయకులు వీకెండ్ అయితే హైదరాబాద్ కు వస్తుంటారు అనేది వాస్తవం. ఇందులో వైసీపీ నాయకులు మినహాయింపు ఏం కాదు. వాళ్ల ఆస్తులను పరిరక్షించుకునేందుకు, తదితర అవసరాల కోసం వారు హైదరాబాద్ వచ్చి ఉంటారు. ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉన్నంత మాత్రాన నాన్ లోకల్ అయిపోతారా అని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
హైదరాబాద్ లో సగానికి పైగా ఏపీ సెటిలర్లు ఉన్నారు. వీరంతా నాన్ లోకల్ అయిపోతారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు జగన్ సోదరి అయిన షర్మిళ తెలంగాణ లో పార్టీ పెట్టి పాదయాత్ర నిర్వహించి ప్రచారం సాగించారు. ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత అటు తెలంగాణలోను, ఇటు ఏపీలోను చంద్రబాబు అభిమానులు, వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. కానీ వీరిని ఏపీ నేతలుగా తెలంగాణ ప్రజలు భావిస్తుంటారు. కాబట్టి పవన్ కల్యాణ్, చంద్రబాబుని అక్కడి ప్రజలు తమ నాయకులగానే చూస్తారు తప్ప తెలంగాణ నేతలుగా చూడరు.