కాశ్మీర్‌పై కన్నేసిన చైనా.. ఇండియా ఎదుర్కోగలదా?

Chakravarthi Kalyan
చైనా తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ప్రతి విషయంలో భారత్ ని చికాకు పెట్టేందుకు యత్నిస్తోంది.  జమ్మూ కాశ్మీర్ కు  స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని  బీజేపీ ప్రభుత్వం గతంలో రద్దు చేసింది. తాజాగా ఈ రద్దుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు సబబే అని సమర్థించింది.  


అయితే ఈ విషయమై చైనా తన మిత్ర దేశం పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచి తన అక్కసును వెళ్లగక్కింది. ఇదిలా ఉంటే చైనా, భారత అవిభాజ్య అంతర్ భాగమైన లడఖ్ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేల్చింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆర్టికల్ 370 పై రద్దు మాట్లాడారు. లడఖ్ ప్రాంతాన్ని భారత్ ఏకపక్షంగా ఏర్పాటు చేసిందని దీన్ని మేం గుర్తించమని సుప్రీం కోర్టు తీర్పు చైనా భారత్ సరిహద్దు పశ్చిమ భాగ వాస్తవ స్థితిని మార్చలేదని అభిప్రాయపడింది.


ఈ ప్రాంతం ఎప్పటికీ మా భూభాగమే అని లడఖ్ గురించి వ్యాఖ్యానించింది.  దీనికి ముందు దాయాది దేశం పాకిస్థాన్ కూడా సుప్రీం కోర్టు తీర్పుపై ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలే  చేసింది.  ఆగస్టు 2019లో భారత్ తీసుకున్న నిర్ణయాలను అంతర్జాతీయ చట్టం గుర్తించదు.   ఆర్టికల్ 370 రద్దు కూడా ఏకపక్ష తీర్పని  దీనికి చట్టబద్ధమైన విలువ లేదని పాక్ కారుకూతల కూసింది. దీనిపై కూడా చైనా స్పందిస్తూ కశ్మీర్ సమస్యపై పాక్, భారత్ దేశాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూ పాకిస్థాన్ కు అండగా నిలిచింది.


ఇరు దేశాలు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుత మార్గంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని .. కాశ్మీర్ పై చైనా వైఖరి స్పష్టంగా ఉందంటూ డ్రాగన్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: