దేశంలోనే ఏపీకి ఫస్ట్‌ ర్యాంక్‌.. ఎందులో అంటే?

Chakravarthi Kalyan
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. అభివృద్ధి కుంటుపడిందని.. తిరిగి ప్రగతి పథంలో పయనించాలంటే మార్పు రావాలని ప్రతి పక్ష టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.  వీరికి ఎల్లో మీడియా మద్దతుగా నిలుస్తోంది.  ఉన్నది లేనట్లు చూపుతూ ప్రజలను అయోమయంలో పడేయాలని చూస్తోంది.  కానీ పలు నివేదికలు మాత్రం ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెబుతోంది.


ఆంధ్రా రోజు రోజుకూ నాశనం అవుతుందని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. వాటిని కొద్ది సేపు పక్కన పెడితే జరుగుతున్న మంచిని కూడా చూద్దాం. తాజాగా మౌలిక వసతుల కల్పనకు వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పనులు కళ్లకు కట్టినట్లు కనిపించనట్లు కనిపిస్తున్నాయని.. వీటిని వినియోగిస్తున్న వారు వైసీపీ చేపడుతున్న చర్యలను  కొనియాడుతున్నారని లివీస్ నివేదిక తాజాగా పేర్కొంది.  లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో  విధానం స్పందన వంటికి తీసుకురావడం వల్ల తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని లీస్ తెలిపింది.


దేశ సగటుతో పోల్చితే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని పేర్కొంది.  రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టు లాస్ట్ మైల్ అనుసంధానంలో ఏపీ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టుల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ వాటిని అభివృద్ధి చేస్తున్నారని ప్రశసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడం పట్ల  పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ లీడ్ తన నివేదికలో వెల్లడించింది.  సులభతర సరకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటిందని లాజిస్టిక్ రంగంలో కేంద్ర వాణిజ్య  శాఖ ఇచ్చే నివేదిక ఇది. తీర ప్రాంతాల రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: