తీవ్రరూపం దాలుస్తున్న ఇజ్రాయెల్‌ యుద్ధం?

Chakravarthi Kalyan
ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ విస్తరిస్తోంది. ఇరాన్ బ్రిగేడియర్ ను ఇరాక్ లోని అమెరికా స్థావరంపై ఇరాన్ మద్దతిచ్చే మిలిటెంట్లు సోమవారం డ్రోన్ దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిగా మంగళవారం తెల్లవారుఘామున అమెరికా యుద్ధ విమానాలు ఇరాక్ లోని మూడు మిలిటెంట్ స్థావరాలపై దాడి చేశాయి. అందులో కతైబ్ హెజ్బుల్లా స్థావరం ఒకటి ఉంది.


ఈ దాడుల్లో ఒక మిలిటెంట్ మృతి చెందగా 18మంది గాయపడ్డారు. ఇప్పటి దాకా అదపాదడపా దాడులు చేసినా సోమ, మంగళవారాల్లో దాడులతో ఈ ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా మారినట్లు కనిపిస్తోంది. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా కు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తరచూ దాడులు జరుగుతున్నా అది అంతవరకే పరిమితం అయింది. కానీ ఇరాన్ బ్రిగేడియర్ ను అంతమొందించడం అమెరికా స్థావరంపై దాడి పరిస్థితిని కొంత ఉద్రిక్తంగా మార్చింది. మరోవైపు ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతూనే ఉన్నాయి.


మధ్య గాజాలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులను మరింత పెంచింది. నుసైరత్, మఘాజీ, బురెజ్ లలో శిబిరాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటు ఉత్తర గాజాలోని పట్టణాల్లో, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ లో ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ మిలిటెంట్లకు భీకర పోరాటం సాగుతోంది.


ఉత్తర ఇజ్రాయెల్లోని షామెరాలో చర్చిపై లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను తరలిస్తుండగా ఇజ్రాయెల్ దళాలే లక్ష్యంగా మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో 9మంది ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. ఈజిప్టుకు చెందిన ఎర్రసముద్రంలో రిసార్టు నగరమైన దహాబ్ లో పేలుడు సంభవించింది. ఎగిరే వస్తువులను భద్రతా దళాలు కూల్చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపు దాడి చేయడంపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR

సంబంధిత వార్తలు: