రేవంత్: ఫ్రీ ఆర్టీసీ అయ్యింది, ఇక ఫ్రీ స్కూటీస్?
అలాగే 18ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఎలక్ర్టిక్ స్కూటర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు వీటి కోసం యువత ఎదురు చూస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకాన్ని ప్రాంరభించి యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా అధికారులను అప్రమత్తం చేసింది. పథకం అమలు తీరుపై విధి విధానాలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ఒక్కో స్కూటీ ధర మార్కెట్ లో సామథ్యం బట్టి సరాసరి రూ.40వేల నుంచి రూ.లక్షన్నర పైచిలుకే ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడిసన్, డిగ్రీ, పీజీ, వృత్తి వివిధ మేనేజ్ మెంట్ కళాశాల్లో చదువుతున్న అమ్మాయిలు ఈ పథకానికి వర్తిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 5279 కాలేజీలు ఉన్నాయి. ఈ మొత్తం కాలేజీల్లో సుమారు 5లక్షల మంది విద్యార్థినులు ఉన్నారు. ప్రస్తుతం కేంద్రం ఫేమ్ పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ లెక్కన ఒక్కో స్కూటీకి గరిస్ఠంగా 40శాతం సబ్సీడీ వచ్చే అవకాశం ఉంది. సుమారు ఒక్కో స్కూటీ రూ.50వేల చొప్పున లెక్కేసినా రూ.350కోట్ల ఖర్చవుతుంది. ఇక సబ్సీడీ లేకుంటే ఈ ఖర్చు రెండింతలు అవుతుంది. ప్రభుత్వ కళాశాలలో చదివే వారికే ఇస్తారా.. లేక ప్రైవేట్ వారికి కూడా అవకాశం కల్పిస్తారా అనేది తేలడం లేదు. దీంతో పాటు చాలామందికి డ్రైవింగ్ లైసెన్సులు లేవు. చాలా మందికి రోడ్డు భద్రత గురించి అవగాహన తక్కువ. మరి సీఎం రేవంత్ రెడ్డి వీటన్నింటిని ఎలా అధిగమిస్తారో చూడాలి.