రెచ్చిపోతున్న కేసీఆర్.. జనం పట్టించుకుంటారా?
రైతులు అంటే కాంగ్రెస్ కి బాధ్యత లేదని.. కేసీఆర్ వస్తున్నాడు అనగానే కాలవులో నీరు వదిలారని కేసీఆర్ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఒకటి రెండు పిల్లలర్లు కుంగితే రాద్ధాంతం చేశారని.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేరని.. ఇవాళ ఇక్కడే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నారని.. నీకు నీళ్లు ఇవ్వడం చేతకావడం లేదా ఉత్తమ్ కుమార్ అని కేసీఆర్ నిలదీస్తున్నారు.
5 టీఎంసీల నీళ్లు టైల్ పాండ్ నుంచి ఏపీ వాళ్ళు తీసుకువెళుతుంటే ఏమి చేశారని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు బంధు అయ్యాయి.. రెసిడెన్షియల్ పాఠశాలను నాశనము చేశారు.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆహారం బాగా లేక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
4, 5 విద్యార్థులు మృతిచెందారని కేసీఆర్ అంటున్నారు.
కేసీఆర్ కేసులకు, జైళ్లకి భయపడే వ్యక్తి కాదన్న కేసీఆర్.. ప్రాణం పోయినా పర్వాలేదు.. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదని గర్జిస్తున్నారు. రైతులందరికీ రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేసీఆర్ గర్జనను జనం ఏమేరకు పట్టించుకుంటారో చూడాలి.