ఇక ముందు అంతా ప్రపంచ యుద్ధాలేనా?
అటు తైవాన్ మీదకి ఎప్పుడు కాలు దువ్వుదామా అని చైనా ఉరుకులాడుతోంది. ఇవన్నీ ప్రపంచ శాంతిని ప్రమాదంలో పడవేసే ఘటనలే. హమాస్ దాడికి ప్రతీకారమంటూ.. గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ అక్కడ మారణహోమం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 30 వేల మంది పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ క్రమంలో సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ కాన్సులేట్ ధ్వంసమైంది. ఈ దాడిలో ఇరాన్ దౌత్య సిబ్బంది పాటు పలువురు సీనియర్ సైనాధికారులు కూడా మరణించారు. దీంతో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
1991లో ఇరాక్ తర్వాత ఇజ్రాయెల్ ఓ శత్రుదేశం ప్రత్యక్ష దాడికి దిగడం ఇదే ప్రథమం. అయితే ఈ మొత్తం దాడుల వెనుక వేరే కోణం ఉందేమో అనిపిస్తోంది. ఏదైనా ముఖ్య విషయాన్ని పక్కదోవ పట్టించేలా కొన్ని సార్లు ప్రభుత్వాలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటాయి. సరైన ఉపాధి, ఉద్యోగ కల్పన సాధించలేనప్పుడు ప్రభుత్వాలపై వ్యతిరేకత సహజంగా వస్తుంటుంది. వీటిని కప్పు పుచ్చుకునేందుకు యూరప్, అమెరికా, నాటో దేశాలు యుద్ధం అనే కొత్త ఎత్తుగడను ఎత్తుకున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక బయటి దేశాల్లో ఉద్యోగ నియామకాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. కనీసం ఐదు శాతం రిక్రూట్ మెంట్లు కూడా జరగడం లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు దొరక్క రోడ్డెక్కుతున్నారు. కొత్తవే కాదు. ఉన్నవాటిని కూడా కొంతమంది కోల్పోతున్నారు. ఈ అంశాలను పక్కదోవ పట్టించేందుకు పై దేశాలు తీసుకున్న వ్యూహాత్మక ఎత్తుగడ యుద్ధాలు. శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా.. కావాలనే కొత్త యుద్ధాలను సృష్టిస్తున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.