ఈసీకే సవాల్‌గా మారిన టీడీపీ హార్డ్‌కోర్ ఎన్నారై? చర్యలు ఉంటాయా?
ఇందులో మనం మన ఊరెళ్తే ఈ వెధవ మనకు ఓటు వేయరు అని తెలుస్తుంది. వాడికున్న అవసరం కనుక్కొని మనం ట్యూన్ చేయగలగాలి. ఇలా నాలుగైదు ఓట్లు మారతాయి. ప్రతి నియోజకవర్గంలో ఇలా వెయ్యి ఓట్లు మార్చినా మనం అంతదూరం నుంచి వచ్చినదానికి న్యాయం జరగుతుంది. మనకి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు పెద్ద సమస్య కాదు అని అందులో ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది.
దీనికి స్పందించిన ఈసీ జయరాం కు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన వివరణ ఇస్తూ.. ఎన్నారైలతో జరిగిన సమావేశం రహస్యంగా జరిగింది కాదు. టీడీపీ ఎన్నారై విభాగం సభ్యుడిగా సహచర ప్రవాసాంధ్రులను పార్టీ కోసం పని చేయాలని అభ్యర్థించాను. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించాం. సొంత నిధులను వినియోగించాలని సూచించాం. టీడీపీ ప్రభుత్వంలో వివిధ వర్గాలకు జరిగిన మేలును ప్రచారం చేయడమే మా లక్ష్యం.
నేను ప్రభుత్వ సలహాదారుడిపై తప్పుడు వ్యాఖ్యలు చేశానని.. ప్రజలకు లంచాలిచ్చి ప్రభావితం చేయాలని చూశామని చెప్పడం తగదు. ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం పని చేస్తున్నాను. ఏనాడు నిబంధనలు ఉల్లంఘించలేదు. అయినా నచ్చిన పార్టీకి ప్రచారం చేసుకునే ప్రాథమిక హక్కు ఎన్నారైగా తనకుందని స్పష్టం చేశారు. అయితే భారత చట్టాలను పాటిస్తూ.. గౌరవిస్తున్నట్లు తన వివరణలో వెల్లడించారు. అయితే ఈసీని కూడా జయరాం తప్పుదోవ పట్టించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బులిచ్చి కొనండి అని వీడియోలు స్పష్టంగా ఉంటే ఆయన పై విధంగా వివరణ ఇచ్చారు. మరి ఈసీ ఏం చేస్తుందో చూడాలి.