మొన్న తనను దెబ్బ తీసిన వారిని.. ఇప్పుడు జగన్‌ ఆదుకుంటాడా?

Chakravarthi Kalyan
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి, కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులే అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా ఉపాధ్యాయులు అయితే అవుట్ రైట్ గా కూటమికే తమ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మరోసారి సీపీఎస్ రద్దు అంశం తెరపైకి వచ్చింది. 2019 ఎన్నికల్లో జగన్ సీపీఎస్ రద్దు హామీని ఇచ్చారు. అయితే ఆ హామీని అమలు చేయకుండా గ్యారంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) ను తెచ్చి పెట్టారు. అయితే దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు సీరియస్ అయ్యారు. ఈ పద్ధతి వద్దు అని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పలేదు కానీ.. దీనిని పరిశీలిస్తామని చెప్పారు.

దీంతో 2024 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగ వర్గం అంతా అవుట్ రేట్ గా టీడీపీ కూటమికి తమ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ద్వారా తమ సీపీఎస్ రద్దు డిమాండ్ ని నెరవేర్చుకోవాలని ఉద్యోగులు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమ కోరిక తీరుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై విధి విధానలు ఖరారు కాలేదు కానీ దాదాపు సీఎం చంద్రబాబు కూడా జీపీఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

దీనిని ఆసరాగా తీసుకొని వైసీపీ తన అనుకూల మీడియా టీవీ, పేపర్లలో ఉద్యోగులకు అనుకూలంగా కథనాలు ప్రచురిస్తోంది. గతంలో ఎల్లో మీడియా ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం అని రాస్తే.. నేడు అదే ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ అనుకూల మీడియా కథనాలను ప్రచురిస్తోంది. నాడు ఉద్యోగులకు టీడీపీ నేతలు, మీడియా అండగా ఉంటే.. నేడు వైసీపీ నాయకులు,  వారి మీడియా వారి తరఫున ఉంది. మొత్తం ఉద్యోగుల డిమాండ్లు మాత్రం నెరవేరడం లేదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: