బ్రిటన్‌కు టైమ్‌ చూసి షాక్‌ ఇచ్చిన మోదీ..?

Chakravarthi Kalyan
బ్రిటన్ లో కొత్త సర్కారు కొలువుదీరింది. ఇది కమ్యూనిస్టుల ప్రభుత్వం.  వాస్తవంగా చెప్పాలంటే ఇది ఖలీస్థానీలకు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో భారత్ కు కొంత వ్యతిరేకంగా కూడా ఉంటుంది.  ఇప్పటి వరకు అధికారంలో ఉన్న రిషి సునాక్ ఖలీస్థానీలను నియంత్రించ గలిగారు. భారత్ కు అండగా నిలబడ్డారు. కానీ కొత్త ప్రభుత్వం ఇండియాకు ఏ మేర సహాయ సహకారాలు అందిస్తుందో చూడాలి.

ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా, అమెరికా ఈ నాలుగు దేశాలు ఖలీస్థానీ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ఆస్ర్టేలియా ఖలీస్థానీ ఉగ్రవాదుల్ని కొంత కంట్రోల్ చేయగా.. ఇప్పటి వరకు బ్రిటన్  కూడా వారిని నియంత్రించింది. కాకపోతే ఇక నుంచి వారికి ఎదురే లేకుండా పోతుంది. ఖలీస్థానీ ఉద్యమానికి లేబర్ పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన భారత్.. బ్రిటన్ కు ముకుతాడు వేసే ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.

హిందూ మహా సముద్రంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం కోసం మారిషస్, బ్రిటన్ లు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో దీనిపై పూర్తి అధికారం తమకే ఉందని మారిషస్ ప్రకటించింది. అయితే అమెరికా సైనిక స్థావరం డియోగో గార్సియా ఇక్కడే ఉండగా.. ఈ ద్వీప సముదాయం ముమ్మాటికీ తమదేనని బ్రిటన్ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మారిషస్ తన బృందాన్ని అక్కడికి పంపింది.

1969లో బ్రిటన్ వలస పాలన నుంచి మారిషస్ స్వాతంత్ర్యం పొందడానికి ముందు వరకు చాగోస్ దీవులు మారిషస్ లో భాగంగా ఉండేవి. కానీ బ్రిటన్ మారిషన్ ను చట్ట విరుద్ధంగా విభజించిందని అంతర్జాతీయ న్యాయ స్థానం నాన్ బైండింగ్ ఒపీనియన్ ను వ్యక్తం చేసింది. ఈ దీవులను మారిషస్ కు అప్పగించాలని ఐరాస సాధారణ సభ బ్రిటన్ ను డిమాండ్ చేస్తూ తీర్మానించింది కూడా. అయినా బ్రిటన్ మొండిగా ఇది తమదేనని మూర్ఖంగా వాదిస్తోంది. ఇప్పుడు తాజాగా దీనిపై స్పందించిన భారత్ చాగోస్ ఐల్యాండ్స్ మారిషస్ వే నని తాము అంగీకరిస్తున్నామని ప్రకటించింది. తద్వారా బ్రిటన్ ను చెక్ పెట్టినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: