ట్యాషన్ టీచర్‌పై ప్రేమ.. పిల్లాడి చిలిపి చేష్టలు?
తాజాగా చెన్నైలో ఓ మైనర్ బాలుడు(17) ట్యూషన్ టీచర్(22)తో ప్రేమలో పడ్డాడు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆమె ఆ బాలుడిని దూరం పెట్టింది. ఆ కోపంతో టీచర్ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. దాని కోసం వినూత్న పద్ధతిలో వేధింపులకు పాల్పడ్డాడు. ఆ యువతి పేరిట చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్ లైన్ ఆర్డర్లు పెట్టసాగాడు.
ఇలా పది సార్లు.. కాదు ఇరవై సార్లు.. కాదు ఏకంగా వందల సార్లు ఆన్ లైన్ ఆర్డర్లు రావడంతో వారి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అయింది. 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్ ని బుక్ చేశాడు. ఆ ఆర్డర్స్ తో డెలీవరీ కోసం వచ్చే వారికి సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతం అయింది. చివరకు ఎవరో తమ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నాడన్న విషయం కనిపెట్టారు.
వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తమ కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీన్లోకి దిగి.. తర్వాత క్షుణ్ణంగా విచారణ జరిపారు. దీంతో ఫోన్ నంబర్ ఆధారంగా.. ఈ తరహా ఆన్ లైన్ వేధింపులకు పాల్పడుతున్న కుర్రాడిని గుర్తించారు. చివరకు అతడిని అరెస్టు చేయగా.. తమ వద్దకు ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలుడనే విషయాన్ని ఆమె చెప్పడంతో వారు అవాక్కయ్యారు. కోర్టు సైతం అతడి మానసిక ఆరోగ్యాన్ని చెక్ చేసి కౌన్సెలింగ్ ఇవ్వాలన్న ఆదేశాలు జారీ చేసింది.