అక్కడ ఆడపిల్లలకు బంపర్ ఆఫర్.. ఓట్లు రాలతాయా?
ఆ తర్వాత ఈ పథకాలను చాలా రాష్ట్రాలు అనివార్యంగా తమ దగ్గర అమలు చేయాల్సి వచ్చింది. చాలా రాష్ట్రాలు ఏపీని అనుసరించాయి. అయితే వైఎస్సార్ మరణాంతంరం కూడా వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ లు ఈ పథకాల జోలికి వెళ్లలేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వీటిని కొనసాగిస్తూ వచ్చారు.
పేర్లు మార్చినా.. వీటిని అయితే ఆపలేదు. ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి అయితే పాఠశాల్లలో చదవి విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం అందజేశారు. అయితే ఇప్పుడు తాజాగా.. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా ఈ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మన దగ్గర అయితే ఈ పథకం అందరకీ దక్కదు. ముఖ్యంగా పేదలను ఉద్దేశించి పెట్టింది కాబట్టి తెల్ల రేషన్ కార్డు దారులందరికీ దీనిని వర్తింపజేశారు.
ఇక మహా రాష్ట్ర విషయానికొస్తే.. అక్కడ ప్రస్తుతం ఎన్డీయే సర్కారు అధికారంలో ఉంది. వచ్చే డిసెంబరులో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో శిందే నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం కలిగిన కుటుంబాల్లోని ఆడపిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని ఆలోచన చేసింది. ఈ మేరకు ఆడ పిల్లల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని శిందే సర్కారు తెలిపింది. మరి ఈ పథకం ఎన్డీయే కూటమికి ఓట్లు రాల్చుతాయా లేదా అనేది చూడాలి.