ఆ ఒక్క నిర్ణయంతో చంద్రబాబులా.. రేవంత్‌ రెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతారా?

frame ఆ ఒక్క నిర్ణయంతో చంద్రబాబులా.. రేవంత్‌ రెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతారా?

Chakravarthi Kalyan
ఫార్మా సిటీ. .. ఫ్యూచర్ సిటీ.. నాలుగో నగరం కాలుష్య రహిత నెట్ జీరో సిటీ.. ఇలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి ఏం చెప్పినా చివరకు వెళ్లి ఆగేది ముచ్చర్ల దగ్గరే.  హైదరాబాద్ మహా నగరానికి ఇప్పటి వరకు హైదరాబాద్.. సికింద్రాబాద్, సైబరాబాద్ అన్నవి ఉంటే.. రానున్న నాలుగేళ్ల వ్యవధిలో మరో మహా నగరాన్ని నిర్మిస్తామని అదే హైదరాబాద్ కు నాలుగో నగరంగా మారుతుందని.. అదే భవిష్యత్తు సిటీగా మారబోతుందని సీఎం పదే పదే ప్రస్తావిస్తున్నారు.

వాస్తవంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పలు ఇంటర్య్యూల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నాలుగో నగరం నిర్మిస్తామని చెప్పారు. దీంతో పాటు అధికారంలోకి వస్తామని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ తో నాలుగో నగరం నిర్మాస్తాం.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా దాని నిర్మాణం ఉంటుందని తెలిపారు.

అంతే కాదు సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి.. ఫార్మాసిటీ వద్ద కొత్త నగరాన్ని క్రియేట్ చేస్తామని.. దీని కోసం భారీ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పడం తెలిసిందే. ఈ కొత్త చోట ఐటీ కంపెనీలు వ్యాపారం మొదలు.. పర్యాటకం.. విద్య… ఆరోగ్యం.. ఏఐ హబ్ తో పాటు స్కిల్ సిటీగా మారుస్తామని చెబుతున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో అద్భుత నగరిగా మారుస్తామని హైదరాబాద్ ఫ్యూచర్ అదేనంటూ రేవంత్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా మరోసారి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా కూడా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నాలుగు వేల ఎకరాల్లో నగరం రూపుదాలుస్తుంది. ఇది నాలుగో నగరం అవుతుంది. అక్కడ ఆరోగ్య, క్రీడా, హబ్ లు ఏర్పాటు చేస్తాం. ఆ నగరానికి మెట్రో తో అనుసంధానం చేస్తాం. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా వ్యవసాయం నుంచి ఏఐ వరకు పలు రంగాలపై నూతన విధానాలను రూపొందిస్తాం అని సీఎం పేర్కొన్నారు. ఇలా  ఏం చెప్పినా.. ఎటు తిప్పినా చివరకు ముచ్చర్ల దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: