చంద్రబాబు కేసు.. లంచానికి లైసెన్సులా మారుతోందా?

frame చంద్రబాబు కేసు.. లంచానికి లైసెన్సులా మారుతోందా?

Chakravarthi Kalyan
దక్షిణ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఒక డీఆర్ఎం స్థాయి వ్యక్తిని అవినీతి ఆరోపణలతో ఆధారాలతో సహా అరెస్టు చేశారు. మొత్తం మీద రైల్వే శాఖలోని అత్యున్నత స్థాయి అధికారులు పట్టుబడటం సంచలనం కలిగించడమే కాకుండా.. ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
అవినీతి ఆరోపణలతో గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్ ను సీబీఐ అధికారులు గత నెల 6న అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. డీఆర్ఎం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

డీఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు మరో నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లను అభివృద్ధి చేసే గతి శక్తి పథకంలో భాగంగా జరుగుతున్న పలు బ్రిడ్జి పనులను నిర్వహించిన కాంట్రాక్టర్లు కొంతమంది అధికారులపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ సోదాలు నిర్వహించడంతో పాటు అంతకు ముందు నుంచే వీరిపై నిఘా పెట్టింది. చివరగా గుంతకల్ డీఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు మరో నలుగురుపై అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

అయితే వీరికి తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో వింత ఏముంది అనుకుంటే దీనికి చంద్రబాబుకి బెయిల్ వచ్చిన విషయానికి లింక్ ముడిపడి ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నాడు చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంలో ఆయన అరెస్టు చెల్లదంటూ.. తరఫు లాయర్ సిద్ధార్థ్ లూధ్రా 17 ఏ చట్టం చంద్రబాబుకి వర్తిస్తుందని పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు కొట్టేయడంతో సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో ముందుగా ఆయనకు ఆరోగ్య పర సమస్యలపై ఆ తర్వాత జనరల్ బెయిల్ మంజూరైంది.

అయితే ఈ కేసును బేస్ చేసుకొని ప్రస్తుతం రైల్వే ఉద్యోగులగు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా  వాళ్ల తరఫు లాయర్ కేసు వాదిస్తూ చంద్రబాబు కేసులో ఉన్న సెక్షన్ 17ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ వీరికి కూడా వర్తించదు అని చెప్పి వినీత్ సింగ్ పాటు మరో ఇద్దరికి బెయిల్ ఇప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: