వినేశ్‌ ఫోగాట్‌ అనర్హతపైనా రాజకీయమా.. హవ్వ?

frame వినేశ్‌ ఫోగాట్‌ అనర్హతపైనా రాజకీయమా.. హవ్వ?

Chakravarthi Kalyan
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై ఒలింపిక్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సైమీ ఫైనల్ లో అద్బుత ప్రదర్శన కనబరిచి ఫైనల్ కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగాట్ ను.. ఫైనల్స్ కి ఎలిజిబుల్ కాదంటూ ఆమె పోటీ పడుతున్న విభాగంలో 100 గ్రాముల అధిక బరువు ఉందంటూ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు.

దీంతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి. ఫైనల్ పోరులో ఆమె గోల్డ్ మెడల్ సాధిస్తుందని అంతా భావించారు. తద్వారా భారత్ బంగారు పతకం  కల సాకారమవుతుందని కోట్లాదిమంది భారతీయులు గంపెడాశలతో ఎదురు చూశారు. కానీ ఆమె అనర్హతకు గురి కావడంతో భారత్ ఆశలు అడియాసలయ్యాయి. వినేశ్ ఫోగాట్ అయితే గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ 100 గ్రాముల బరువును తగ్గించుకునేందుకు ఆమె తన జుత్తును సైతం కత్తిరించుకుంది. శరీరం నుంచి రక్తాన్ని తొలగించుకొంది. స్కిప్పింగ్ చేసింది. అన్నం మానేసింది. అయినా చివరకు అనర్హతకు గురి అయింది.

ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వేగంగా స్పందించారు. నువ్వు విజేతలకు విజేతవు అని.. నీ ఆట తీరు దేశానికి స్పూర్తిదాయకమని.. భారతీయులందరూ నిన్ను ప్రేరణగా తీసుకుంటున్నారు అని పోస్టు చేశారు. అంతేకాకుండా.. నీపై విధించిన వేటు చాలా ఇబ్బంది కలిగించింది. దీనిని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ వేదన నుంచి నువ్వు త్వరగా బయట పడాలి. అత్యంత బలంగా తిరిగి రావాలి ఈ కష్టకాలంలో మీకు అండగా మేముంటాం అని పోస్టు లో పేర్కొన్నారు.

ఇదే విషయమై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో ఫోన్లో కూడా మాట్లాడారు.అనర్హతను సవాల్ చేసేందుకు ఉన్న అవకాశాలను ఆరా తీశారు. అయితే కొంతమంది ప్రధానిపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు , పోస్టులు పెడుతున్నారు. ఈమె అనర్హత విషయంలో ప్రధాని పాత్ర ఉందంటూ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఫోగట్ అనర్హతకు మోదీకి సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు అని మండి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: