ఏపీలో రైతుల కష్టాలు.. బాబు తీరు వల్లనేనా?

frame ఏపీలో రైతుల కష్టాలు.. బాబు తీరు వల్లనేనా?

Chakravarthi Kalyan
నాగార్జున సాగర్ నిండిపోయంది. పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారిపోయింది. ఇంకా పైనుంచి వరద వస్తూనే ఉంది. ఇక వచ్చిన వరద వచ్చినట్లు సముద్రంలోకి వదిలేయాల్సిందే. ఈ క్రమంలో సాగర్ ప్రాజెక్టు పరిధిలోని చెరువులను, కుంటలను నీటితో నింపేస్తున్నారు అధికారులు. దీంతో అన్నదాతల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబిక్కింది. వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు.

దీంతో పల్నాడు జిల్లాలో వరి విత్తానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఒక్కసారిగా ఊహించని విధంగా పెరగడంతో అధికారులు రైతులందరికీ టోకెన్ల ద్వారా విత్తనాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు పంట వేయడం కాస్త ఆలస్యం కావడంతో వేసవిలో లేటుగా వరి పంట చేతికి వస్తుంది. దీంతో త్వరగా పంట చేతికొచ్చే జగిత్యాల సన్నరకం విత్తనాలు కావాలని రైతులు కోరుతున్నారు. దీంతో ఈ రకం గింజలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక ప్రైవేట్ లోనూ విత్తనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది.

నిజానికి మార్కెట్ లో సరిపడా విత్తనాలు ఉన్నా.. ఒక జగిత్యాల సన్నరకానికి రైతులు మొగ్గు చూపడంతో అధికారులకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అయితే ఇది కరీంనగర్ లోని జగిత్యాలలో దొరికే విత్తనమని దానికి గతంలో తక్కువగా డిమాండ్ ఉండేదని.. కానీ ఇప్పుడు పంట త్వరగా చేతికి రావాలనే ఉద్దేశంతో రైతులు దీనిని ఎక్కువగా అడుగుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే విత్తన కొరత తీవ్రంగా ఉందనే విషయాన్ని అటు ఎల్లో మీడియా వేరేలా ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ వైసీపీ మాత్రం క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవని.. వైఎస్ జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు అందేవని పోస్టులు పెడుతున్నారు. పోలీస్ బందో బస్తు మధ్య విత్తనాలు పంపిణీ చేయాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. కొంతమంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలైన్లో నిలబడి వాటిని తీసుకుంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే వక్రీకరణలు సహజం. ఎవరికీ అనుకూలంగా వారు వార్తలు రాసుకొంటున్నారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: