అచ్చం బాబునే ఫాలో అయిపోతున్న లోకేశ్.. సక్సస్ అవుతాడా?
ఇప్పుడు నారా లోకేశ్ కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు అనిపిస్తోంది. రాష్ట్రంలో గ్లోబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్శిటీ ఏర్పాటుకు అనువైన స్థంల, ఎక్కడైతే బాగుంటుంది, కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి వంటి తదితర అంశాలపై అధ్యయనం చేయాలని ఆయన అధికారును ఆదేశించారు. ఏఐ టెక్నాలజీ వర్శిటీతో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్, లాంటి మొత్తం 16 రంగాల్లో సేవలను విస్తృతం చేయవచ్చని లోకేశ్ అన్నారు.
ఇక ఏపీని ఆర్టిఫిషియల్ ఇటిలెజెన్స్ హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. విద్యారంగానికి సంబంధించి అదునాతన ఏఐ టెక్నాలజీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని అన్నారు. దీని ద్వారా విద్యార్థుల అటెండెన్స్ తో పాటు వారి తెలివి తేటలు అంచనా వేసి.. వారిన మెరుగుపరిచేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున వచ్చే ఏడాది నుంచి యూనివర్శిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. యూనివర్శిటీల్లో పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఉందని.. పరిశ్రమ అనుసంధానిత ఇంటర్న్ షిప్, అప్రెంటిస్ షిప్లు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థులు కుల, ధ్రువీకరణ పత్రాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని వివరించారు.