వామ్మో.. మగాడి వీక్ నెస్ తో నయా మోసం..
మనీ, మగువ ఈ రెండు ఎంతటి బలవంతుడిని అయినా బలహీనుడిని చేస్తాయి. ఇలాంటి జనాల బలహీనతలే మోసగాళ్లకు పెట్టుబడి.. వీక్ నెస్ తెలుసుకొని ముగ్గులోకి లాగితే ఎంతటి వారైనా బోల్తా పడాల్సిందే. మన ఆశను ఆసరగా చేసుకొని కేటుగాళ్లు ఘరనా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో డబ్బులు ఆశచూపి, అమ్మాయిలను ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పెరిగిపోయాయి.
సరిగ్గా ఇలాంటి హైటెక్ మోసమే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వెలుగుచూసింది. అయితే మనం ఫోన్ చేసి బ్యాంకు వివరాలు తెలుసుకొని మోసాలకు పాల్పడేవారిని చూసుంటాం. ఓటీపీలు, లక్కీ డ్రాలు, ఇంకా వివిధ పద్దతుల ద్వారా వివరాలు సేకరించి డబ్బులు ఊడ్చేయడం గురించి రోజూ వింటూనే ఉన్నాం. కానీ మన చేతులతోనే కేటుగాళ్లకు డబ్బులిచ్చి మోసపోవడం గురించి విన్నారా.. ఇలాంటి ఘరానా మోసాలే మోట్రో నగరాల్లో ఎక్కువ అయ్యాయి.
తాజాగా ముంబయిలో అమ్మాయిలను ఎరగా వేసి కొన్ని పబ్ లు సాగిస్తున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పబ్ అమ్మాయిలను అడ్డం పెట్టుకొని అమాయకులను ఎలా మోసం చేస్తారో ప్రముఖ జర్నలిస్ట్ దీపికా నారయణ్ భరద్వాజ్ భయటపెట్టారు. టిండర్, జంబుల్ వంటి డేటింగ్ యాప్ ల ద్వారా అమ్మాయి పరిచయాలు అబ్బాయిలకు జేబులను ఎలా ఖాళీ చేస్తున్నాయో వివరించారామె.
పాపులర్ డేటింగ్ యాప్లో అమ్మాయిలతో పరిచయం కోరుకునే అబ్బాయిలే టార్గెట్ గా పబ్ లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా పరిచయం కాగానే అలా కలుద్దామని మెసేజ్ వస్తుంది. బయట ఎక్కడో ఎందుకు పబ్ లో కలుద్దామని చెబుతారు. అమ్మాయి పిలిచింది కదా అని వెళ్లారో మీ అని పోయినట్టే. పబ్ లో వేలల్లో బిల్లు వేసి మీ జేబులను ఖాళీ చేస్తారు. ఆ తర్వాత వారు మెల్లగా వాష్ రూం, ఇతర వంకలు చెప్పి అక్కడి నుంచి జారుకుంటారు. ఇలా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో అమాయకులు మోసానికి గురయ్యారు. సుమారు వీరి చేత రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లులు చేయిస్తున్నారు. ఆ పబ్ నిర్వాహకులు మోసం చేసి కట్టిచ్చిన దాంట్లో వాటాలు ఇస్తుంటారు.