తర్వాతి ప్రధాని ఎవరో చెప్పిన మోదీ..!

Chakravarthi Kalyan

ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించని విషయం తెలిసిందే. దీంతో ఈ సారి కేంద్రంలో అధికార మార్పిడి పక్కా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్డీయే కూటమి ఎక్కువ కాలం అధికారంలో ఉండదని ఇండియా కూటమి నేతలు సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం మోదీ సర్కారు చంద్రబాబు, నితీశ్ కుమార్ లపై ఆధారపడి ఉంది. 


ఈ  క్రమంలో ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 లోక్‌ సభ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో తర్వాత ప్రధాని ఎవరో కూడా హింట్ ఇచ్చారు.  దేశ పౌరులకు జీవన శైలిని అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా యావత్ ప్రపంచానికి జీవన సౌలభ్యాన్ని భారత ఆర్థిక ఎకో సిస్టమ్ మెరుగు పరుస్తుందని చెప్పారు. ఇది ఐదో గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్. పదో ఫిన్ టెక్ ఫెస్ట్ ను ఉద్దేశించి మాట్లాడేందుకు కూడా నేనే వస్తాను అని చెప్పారు.


వాస్తవానికి ఫిన్ టెక్ ఫెస్ట్ ఏటా జరుగుతూ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాత కూడా తానే ప్రధానిగా ఉంటాననే సంకేతాలను మోదీ పంపించారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానిగా మోదీ పదవీ కాలం 2029 మే నెల వరకు ఉంది. ఆ లెక్కన ఫిన్ టెక్ ఫెస్ట్ 2029 జులై, ఆగస్టులో ఉంటుంది.


అయితే బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్లు దాటిన వారు పదవి చేపట్టడానికి అనర్హులు అనే నియమం ఉంది. దీని ప్రకారం మోదీ మరో రెండేళ్లు మాత్రమే ప్రధానిగా ఉంటారని ప్రతిపక్ష నేతలు ఎన్నికల సమయంలో ప్రస్తావిస్తూ విమర్శించారు. కానీ మోదీ ఇప్పుడే కాదు వచ్చే 2029 ఎన్నికల్లోను తానే ప్రధాని అని చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: